Share this on your social network:
Published:
05-05-2020

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన కు దిగిన కుటుంబీకులు ఏ.ఎల్ ఏ హామీ తో ఆందోళన విరమణ అనధికార మద్యం విక్రయాలు వివాదం వాచ్ మెన్ మృతికి కారణమైన సంఘటన మంగళవారం కూచిపూడి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.అక్రమ మద్యం రవాణాకు అడ్డుపడుతున్నాడనే కారణం తో కోటేశ్వరరావు ను షాపులోని తోటి ఉద్యోగులు హతమార్చినట్లు మృతుని కుటుంబీకులు కూచిపూడి పోలీసు స్టేషన్ వద్ధ ఆందోళన నిర్వహించారు. మంగళవారం ఉదయం6గంటలకు ప్రారంభమైన ఈ ఆందోళన కార్యక్రమంలో మృతుని కుటుంబీకులు మాట్లాడుతూ తనపై దాడి జరిగిననేపద్యం లో ఫిర్యాదు చేసినప్పట్టికీ స్థానిక ఎక్సయిజ్ శాఖ గాని పోలీసు శాఖ గాని స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.సోమవారం రాత్రి 7 గంటలకు షాపును మూసివేయడం తో అదే షాపులో సేల్స్ మెన్ క్యాషియర్ లుగా విధులు నిర్వర్తిస్తున్న జున్ను రాజేష్ బెజవాడ రాజేష్ లమద్యం సేవించి మృతుడితో సైతం బలవంతంగా మద్యం త్రాగించి తీవ్రంగా కొట్టడంతో స్థానికుల సహాయం తో కోటేశ్వరరావు కూచిపూడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి నప్పుటికీ చర్యలు తీసుకోలేదని తీవ్ర గాయాలతో కోటేశ్వరరావు మృతి చెందడo జరిగిందని మృతుని కుటుంబీకులు మీడియా కు తెలిపారు. . కోటేశ్వరరావు మృతి కి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దళితవ్యక్తి హత్యకు గురైన ఇదే నియోజక వర్గ ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలనిదోషులు కఠినంగా శిక్షింపబడాలని కోరుతూ స్టేషన్ ముందుగల 216 జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.వీరి ఆందోళన ఉదృతం గావడం రహదారిపై అత్యవసర వాహనాలు సైతం నిలిచిపోవడం వంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విచ్చేసి బాధిత కుటుంబీకుల ను పరామర్శించి వివరాలు ఆడిగితెలుసుకున్నారు.అలాగే కేసుపురోగతి పోలీసు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధికోసం మద్యం షాపులో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబాల హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్పీ రమేష్ రెడ్డి తోపాటు చల్లపల్లి సి ఐ వెంక ట నారాయణ చల్లపల్లి ఘంటసాల స్టేషన్ ల ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు. కాగా మృతుడు కోటేశ్వరరావు తనపై దాడి జరిగినట్లు గా ఫిర్యాదు చేయగా సోమవారం రాత్రి కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోబడతాయని ఎస్ ఐ హాబీబ్ బాషా తెలిపారు. వివాదానికి కారణం అనధికార విక్రయ మద్యం కారణంగా తెలుస్తున్నది.స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా నే అక్రమ మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తున్నది. జనతా కర్ఫ్యూ తో పాటు కొనసాగిన లాక్డ్ డౌన్ కాలంలో కూడా అనధికార విక్రయాలు కొనసాగినట్లు తెలుస్తున్నది.లాక్డ్ డౌన్ నేపథ్యంలో ఒక్కో మద్యం బాటిల్ పై 2రేట్లు అదనపు ధరలకు విక్రయాలు కొనసాగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎక్సయిజ్ పోలీసు శాఖల నిర్లక్ష్యం కారణంగా యథేచ్ఛగా విక్రయాలు కొనసాగినట్లు ఆవివాదాల కారణంగానే షాపులోని స్థాక్ లో హెచ్చుతగ్గుల కారణంగా వివాదం ముదిరి హత్యకు దారితీసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి .ఇప్పటికైనా మద్యం విక్రయాల పట్ల అధికారులు ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

Related Images



Related News


విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చ


ASP-DSP గుడివాడ పట్టణంలో ఆకస్మిక తినిఖీ

ASP సత్తిబాబు DSP సత్యానందం గారితో కలిసి గుడివాడ పట్టణంలో నగవరప్పాడు, దొండ


తోటి పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులకు అల్పాహారం ఏర్పాటు

తిరువూరు టౌన్ :ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని అంతరాష్ట్ర చెక్ పో


పీటీఎం ఉద్యమ నేత ఆరిఫ్‌ వజీర్ దారుణ హత్య

పాకిస్తాన్‌లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్‌ వజీర్‌ శనివార


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


హైదరాబాద్‌లో నిమ్మగడ్డ పీఎస్‌ను విచారిస్తున్న సీఐడీ!

రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలకలం రేపిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


సత్తెనపల్లిలో యువకుడి మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘట


కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం

విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక


మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత.

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు డీ.సీ.ఆర్బి మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మ


అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆం


తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగాన