Share this on your social network:
Published:
20-05-2017

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ సునాయాసంగా డబ్బు సంపాదించే మార్గాలకు పాల్పడుతున్న ముఠాను కైకలూరు పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. మండలంలోని భుజబలపట్నానికి చెందిన టైలర్‌ గొరిపరల్లి గోపి ఆకివీడు, భీమవరం, కైకలూరు ప్రాంతంలోని కొందరు జూదర్లతో కలిసి కొంతకాలంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సమాచారం మేరకు డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ ఆదేశాల మేరకు సీఐ రవికుమార్‌, రూరల్‌ ఎస్సై రంజిత్‌కుమార్‌ల నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి ఈ నెల 16న సాయంత్రం రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా గోపి తన ఖాతాదారుల నుంచి పందెం సొమ్ములను నమోదు చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత పందెం రాయుళ్లను తన ఇంటివద్దకు రావాలని ఫోన్లో సమాచారం ఇచ్చాడు. దీంతో అప్పటికే నిఘా ఉంచిన సర్కిల్‌ క్రైం పార్టీ సిబ్బంది వెంకటేశ్వరరావు, మస్తాన్‌, రజనీ, నాగరాజు, లక్ష్మయ్యల ఆధ్వర్యంలో దాడిచేసి బుకీని, పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. బుకీ గోపి నుంచి రూ.1,13,170, బెట్టింగ్‌దారుల నుంచి రూ.2,94,350, పందెంలో సొమ్ములు పొగొట్టుకున్న వారి నుంచి రూ.17,480.. మొత్తం రూ.4,25,000 నగదును, వివరాలున్న నోటు పుస్తకాన్ని, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. న్యాయమూర్తి జి.లక్ష్మీవరప్రసాద్‌ రిమాండ్‌ విధించినట్లు ఆయన చెప్పారు.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి