కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం
విజయవాడ చుట్టుగుంట గులామ్ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక్రయించిన సంఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి కె.ఉమారాణి గురువారం కానూరులోని తన కార్యాలయంలో వెల్లడించారు. ‘శిశువు తల్లి వేట బాలనాగమ్మ ఈనెల 7వ తేదీన పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చారు. బాలనాగమ్మను శిశువును పెంచుకునే ఉద్దేశం లేదనే విషయం తెలుసుకున్న ఆస్పత్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైఎస్సార్ కాలనీకి చెందిన బి.రాణి.. ఆమెను సంప్రదించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈనెల 15న బాలనాగమ్మ ఆస్పత్రి నుంచి స్వచ్ఛందంగా డిచార్జ్ అయ్యారు. రూ.16 వేలు తీసుకుని శిశువును సెక్యూరిటీ గార్డుకి అప్పగించారు. అనంతరం రాణి శిశువును గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. అయితే అంగన్‌వాడీ కార్యకర్తలకు అనుమానం రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఐసీడీఎస్ సిబ్బంది రంగంలోకి దిగి విచారణ చేయగా శిశువు విక్రయం వెలుగుచూసింది. శిశువును రక్షించి అత్యవసర వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చట్టవిరుద్ధంగా శిశువును విక్రయించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని పీడీ ఉమారాణి తెలిపారు.
Related Images
Related News
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడ: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చ
ASP-DSP గుడివాడ పట్టణంలో ఆకస్మిక తినిఖీ
ASP సత్తిబాబు DSP సత్యానందం గారితో కలిసి గుడివాడ పట్టణంలో నగవరప్పాడు, దొండ
తోటి పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులకు అల్పాహారం ఏర్పాటు
తిరువూరు టౌన్ :ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని అంతరాష్ట్ర చెక్ పో
పీటీఎం ఉద్యమ నేత ఆరిఫ్ వజీర్ దారుణ హత్య
పాకిస్తాన్‌లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్ వజీర్ శనివార
తెలుగు రాష్ట్రాల గజదొంగ అరెస్టు
వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస
యువకుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్
విజయవాడలోని లబ్బీపేట పి అండ్ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డబ్బు, కార్లు స్వాధీనం
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార
బ్లేడ్ బ్యాచ్ దొంగల అరెస్టు
వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు
హైదరాబాద్‌లో నిమ్మగడ్డ పీఎస్‌ను విచారిస్తున్న సీఐడీ!
రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలకలం రేపిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్
జి.కొండూరు మండలం వెల్లటూరులో భారీ చోరీ
వెల్లటూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ
సత్తెనపల్లిలో యువకుడి మృతి
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘట
కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం
విజయవాడ చుట్టుగుంట గులామ్ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక
మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత.
సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు డీ.సీ.ఆర్బి మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మ
అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి
అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆం
తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!
జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగాన