Share this on your social network:
Published:
06-05-2017

ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుల బంధు, మిత్రులు పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఆరు కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు అక్కడికొచ్చిన వారిని తీవ్రంగా కలచివేశాయి. మృతుల్లో గుంటురు నగరానికి చెందిన ఐదుగురు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వారే. ఒకరిది మాత్రం కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం నందవరం. బంధుమిత్రుల కథనం మేరకు ఆరుగురు గురువారం రెంటచింతలలో బంధువుల వివాహానికి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణంలో గుంటూరు వస్తుండగా మేడికొండూరు వద్ద ఆర్థరాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న బొలేరోను గుంటూరువైపు నుండి వేగంగా వస్తున్న లారీ ఢకొీట్టడంతో బొలేరోలో ఉన్న అందరూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతుల్లో దాసరి కిరణ్‌(45) నగరంలోని నెహ్రూనగర్‌లో టీ క్యాంటిన్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. పోసా వెంకటనారాయణ(45) పొన్నెకల్లులో చికెన్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మాదాను రాజారావు(45) భార్య ఇద్దరు అబ్బాయిలు. జిల్లా కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. సుకుమంచి రాఘవేంద్రరావు(48) భార్య, ఒక పాప, బాబు ఉన్నారు. అరండల్‌పేట నాలుగో లైనులో తులసీ దుర్గ ఫర్నీచర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ముప్పూరి శ్రీనివాసరావు(30), గుంటూరు బస్టాండ్‌ ఎదురు టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలున్నారు. పి.సుబ్బారెడ్డి(47)కర్నూలు జిల్లా బనగానపల్లి నందవరం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుబ్బారెడ్డి పెద్దపాప గుంటూరులోని ఓ స్కూల్లో 8వ తరగతి చదుతుంది. స్కూల్‌ సెలవులు ఇవ్వటంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లటానికి గుంటూరు వచ్చాడు. మిత్రులతో కలిసి పెళ్లి చూసి, తెల్లారి ఇంటికి వెళదామని అనుకున్న సుబ్బారెడ్డి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువుల్ని శుక్రవారం జిజిహెచ్‌ మార్చురీ వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఐజి సంజరు, మిర్చియార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని భరోసా చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా ద్వారా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మృతులు టిడిపి సానుభూతిపరులైనందున వారికి నారాలోకేష్‌ ఆధ్వర్యంలోని కార్యకర్తల సంక్షేమ నిధి నుండి రెండు లక్షలు ఆర్థిక అందించటానికి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు దహన ఖర్చులు అందించాలని తాసీల్దారును ఆదేశించారు. మృతుల కుటుంబాల్లో ఇళ్లు లేని వారందరికీ ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గృహాలు మంజూరు చేస్తామన్నారు.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి