మరో ఫన్నీ వీడియో షేర్ చేసిన వార్నర్
ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దానికి కాస్త గ్యాప్ ఇచ్చాడు. టిక్‌టాక్ వీడియోలను కాసేపు పక్కనుపెట్టి ఓ పాత వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. గత సీజన్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్సన్‌లతో కలిసి చేసిన ఓ సరదా వీడియోను తాజాగా వార్నర్ పోస్ట్ చేశాడు. ఇక్కడ మొదటి వరుసలో ఉన్న సీట్లలో విలియమ్సన్, భువీలు ఉండగా, వెనకాల సీట్లో వార్నర్ ఒక్కడే కూర్చొని ఉంటాడు. దీనిలో భాగంగా బ్యాక్‌గ్రౌండ్‌లో పాపులర్ పాప్ సాంగ్ ‘వాట్ ఈజ్ లవ్’ ప్లే అవుతూ ఉంటుంది. దీనికి ముగ్గురు తమ సీట్లలోనే డ్యాన్స్ రిథమ్ జత కలుపుతారు. ఇందులో విలియమ్సన్, భువీలు కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేయగా, వార్నర్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఊగిపోతూ ఉంటాడు. దీన్ని తాజాగా షేర్ చేసుకున్న వార్నర్..‘ ఇది నన్ను నవ్వుల్లో ముంచెత్తింది’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం వార్నర్.. భార్య క్యాండీస్‌తో కలిసి బుట్టబొమ్మ తెలుగు సాంగ్‌కు స్టెప్పులేశాడు. తన భార్య తో కలిసి బుట్టబొమ్మ స్టెప్పుల్ని అనుకరిస్తూ డాన్స్ చేశాడు. వీడియోలో వార్నర్, క్యాండీస్ కెమిస్ట్రీ కూడా వర్కవుటైంది. అందుకే ఆ పాటలాగే వీరి డాన్స్ అదిరిపోయింది. సన్‌రైజర్స్ జెర్సీ వేసుకొని చిందులేసిన వార్నర్ పాట బాగుందని అర్జున్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయగా... హీరో థ్యాంక్యూ చెప్పారు. ఇది బాగా షేర్ కావడంతో పాటు సూపర్ హిట్ పాట కావడంతో వార్నర్ డ్యాన్స్ వీడీయోకి లైక్‌లు మీద లైక్‌లు వచ్చి పడ్డాయి.
Related Images
Related News
రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్: చాపెల్
ఆసీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్
కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాయిదా
ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంత
ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుద
నాగాయలంకలో జలక్రీడల ఏర్పాటుకు స్థల పరిశీలన
జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున
గుంటూరులో అమరావతి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్
విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా
అంబేద్కర్ జయంతి సందర్భంగా గురజాల ప్రభుత్వ కళాశాలలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జ
క్రికెట్ లో క్రీడాకారులు మరింతగా రానించాలిఃబిసీసీఐ కమిటీ చైర్మన్ ఎంఎస్ కె . ప్రసాద్
అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర
అత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు
మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్ క్రికెట్ పోటీల
మే1నుంచి 31వరకు వేసవి క్రీడా శిక్షణ
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను
అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం
ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మ
టీజీవీ భారత్ ఆంద్ర బ్యాడ్మింటన్ లీగ్ (ఏబిఎల్)లో గోదావరి గన్స్ జట్టు విజయం
రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పన
మరో ఫన్నీ వీడియో షేర్ చేసిన వార్నర్
ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా
‘ప్రపంచ చాంపియన్‌షిప్’ తేదీల్లో మార్పు
వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్