రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్: చాపెల్
ఆసీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడని ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కోహ్లి కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ స్మిత్ కంటే అత్యుత్తమని పేర్కొన్నాడు. రోనా వైరస్ విజృంభణతో విశ్వవ్యాప్తంగా టోర్నీలన్నీ రద్దుకావడంతో ఇండ్లకే పరిమిమైన ఆటగాళ్లు, వ్యాఖ్యతలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే చాపెల్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో రౌనక్ కపూర్ అడిగిన ప్రశ్నకు చాపెల్ బదులిచ్చాడు.కోహ్లి, స్మిత్‌లలో ఒకరిని ఎంచుకోవాలని రౌనక్ కపూర్ అడగ్గా, కెప్టెన్‌గానా.. బ్యాట్స్‌మన్‌గానే అని చాపెల్ తిరిగి ప్రశ్నించాడు. అయితే రెండింటిలోనూ మీ అభిప్రాయం చెప్పండి అని కోరగా కోహ్లిని ఎంచుకున్నాడు చాపెల్. రెండు విభాగాల్లోనూ కోహ్లినే గ్రేట్ అంటూ పేర్కొన్నాడు. ఇటీవల కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లే ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత క్రికెట్‌లో కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లే అత్యుత్తమం అని విలియన్స్ పేర్కొన్నాడు. ప్రస్తుత శకంలో కోహ్లి, డివిలియర్స్‌లే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. అన్ని ఫార్మాట్లలో ఆధిక్యం కనబరుస్తున్న కోహ్లినే ఒక అసాధారణ ఆటగాడన్నాడు. ఇక ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్న ఏబీ ఒక అరుదైన బ్యాట్స్‌మన్ అని విలియమ్సన్ తెలిపాడు. వీరిద్దరే ప్రస్తుతం అత్యుత్తమం అని కేన్ పేర్కొన్నాడు.
Related Images
Related News
రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్: చాపెల్
ఆసీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్
కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాయిదా
ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంత
ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుద
నాగాయలంకలో జలక్రీడల ఏర్పాటుకు స్థల పరిశీలన
జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున
గుంటూరులో అమరావతి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్
విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా
అంబేద్కర్ జయంతి సందర్భంగా గురజాల ప్రభుత్వ కళాశాలలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జ
క్రికెట్ లో క్రీడాకారులు మరింతగా రానించాలిఃబిసీసీఐ కమిటీ చైర్మన్ ఎంఎస్ కె . ప్రసాద్
అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర
అత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు
మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్ క్రికెట్ పోటీల
మే1నుంచి 31వరకు వేసవి క్రీడా శిక్షణ
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను
అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం
ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మ
టీజీవీ భారత్ ఆంద్ర బ్యాడ్మింటన్ లీగ్ (ఏబిఎల్)లో గోదావరి గన్స్ జట్టు విజయం
రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పన
మరో ఫన్నీ వీడియో షేర్ చేసిన వార్నర్
ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా
‘ప్రపంచ చాంపియన్‌షిప్’ తేదీల్లో మార్పు
వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్