Share this on your social network:
Published:
06-04-2017

నాగాయ‌లంక‌లో జ‌ల‌క్రీడ‌ల ఏర్పాటుకు స్థ‌ల ప‌రిశీల‌న‌

జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున్నాయనే విషయంపై అధ్యయనం చేసేందుకు శాప్‌ ప్రతినిధి బృందం నాగాయలంకలో పర్యటించింది. శాప్‌ ఉప సంచాలకుడు(డీడీ) వి.నాగరాజు, డీఎస్‌డీవో సిరాజుద్డీన్‌ బుధవారం నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రాన్ని సందర్శించి అవకాశాలను పరిశీలించారు. రాష్ట్రంలోనే మొదటి జలక్రీడల శిక్షణా కేంద్రంగా నాగాయలంకను తీర్చిదిద్దాలని భావిస్తున్న శాప్‌ ప్రతినిధి బృందం విద్యార్థుల వసతి కోసం తాత్కాలిక ప్రాతిపదికన కె.పాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. జలక్రీడల శిక్షణకు అతి ముఖ్యమైన రివర్‌ఫ్రంట్‌ కోసం నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌ పక్కన ఉన్న 200మీటర్ల స్థలాన్ని పరిశీలించి వెంటనే మూడు వరసల స్టోరేజ్‌ షెడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రంలోని బ్యాక్‌వాటర్‌ పాయ జలక్రీడల శిక్షణకు అనువైన ప్రాంతమని శాప్‌ డీడీ నాగరాజు తెలిపారు. దాదాపు 40 కి.మీ.ల పొడవున్న నదిలో కేవలం 5 కి.మీ.ల మేర మాత్రమే శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని, మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఆటుపోట్ల వడి వేగానికి (అండర్‌ కరెంట్‌) వ్యతిరేక దిశలో విద్యార్థులకు శిక్షణ పొందే అవకాశం ఉంటుందన్నారు. దీని వల్ల అంతర్జాతీయ పోటీల్లో సాధారణ కొలనుల్లో క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని కనబరిచే అవకాశం ఏర్పడుతుందని నాగరాజు తెలిపారు. సెయిలింగ్‌, కయాకింగ్‌, రోయింగ్‌ తదితర క్రీడలకు ఇక్కడ శిక్షణ ఇస్తామని, జూన్‌, జులై నాటికి ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related Images



Related News


రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్‌: చాపెల్‌

ఆసీస్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కంటే టీమిండియా కెప్


కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వాయిదా

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంత


ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ

భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుద


నాగాయ‌లంక‌లో జ‌ల‌క్రీడ‌ల ఏర్పాటుకు స్థ‌ల ప‌రిశీల‌న‌

జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున


గుంటూరులో అమ‌రావ‌తి ఓపెన్ కరాటే ఛాంపియ‌న్ షిప్‌

విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా


అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా గుర‌జాల ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు

గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని జ


క్రికెట్ లో క్రీడాకారులు మ‌రింత‌గా రానించాలిఃబిసీసీఐ క‌మిటీ చైర్మ‌న్ ఎంఎస్ కె . ప్ర‌సాద్

అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర


అత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు

మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్‌ క్రికెట్‌ పోటీల


మే1నుంచి 31వ‌ర‌కు వేస‌వి క్రీడా శిక్ష‌ణ‌

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను


అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం

ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మ


టీజీవీ భార‌త్ ఆంద్ర బ్యాడ్మింట‌న్ లీగ్ (ఏబిఎల్)లో గోదావ‌రి గ‌న్స్ జ‌ట్టు విజ‌యం

రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత


రెజ్లింగ్‌ కోచ్‌లకు అందని జీతాలు

కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పన


మరో ఫన్నీ వీడియో షేర్‌ చేసిన వార్నర్‌

ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా


‘ప్రపంచ చాంపియన్‌షిప్’‌ తేదీల్లో మార్పు

వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్‌ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్