Share this on your social network:
Published:
26-04-2017

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి వారి నుంచి రూ.1.13 లక్షల డ‌బ్బు, సెల్‌ఫోన్లు, రెండు కార్లు, ల్యాప్‌టాప్‌, టీవీని స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ సత్యానందం, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ కె.మురళీధర్ విజ‌య‌వాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. గుడివాడ రామివారి వీధికి చెందిన మిరియాల వెంకట నాగ ఈశ్వరరావు ఎనికేపాడులోని మహితా నివాస్‌ అపార్టుమెంట్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. గుడివాడకు చెందిన గోగం సురేష్‌, పుట్టి రాజులను ఫ్లాట్‌లో ఉంచి ఇక్కడి నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌లు కాసేవాడు. ఈశ్వరరావు ముంబయిలో ఒక బుకీతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. అతనితో ఫోన్‌లో వివరాలు తెలుసుకుంటూ, దాని ప్రకారం పందేలు నిర్వహించేవాడు. దీనిపై సమాచారం అందడంతో టాస్క్‌పోర్సు పోలీసులు నిఘా ఉంచి, పక్కా సమాచారంతో ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించారు. పందేలు కాస్తున్న నిర్వాహకుడు నాగ ఈశ్వరరావు, గోగం సురేష్‌, పుట్టి రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పదమూడు సెల్‌ఫోన్లు, స్విఫ్ట్‌ డిజైర్‌, రెనాల్ట్‌ డస్టర్‌ కార్లు, ల్యాప్‌టాప్‌, ఎల్‌ఈడీ టీవీని స్వాధీనం చేసుకొని పటమట పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారించగా, బెట్టింగ్‌కు పాల్పడుతున్న మరో నలుగురి సమాచారాన్ని ఇచ్చారు. దాని ప్రకారం విజయవాడ దేవీనగర్‌కు చెందిన వేగిరెడ్డి శ్రీనివాసరావు, పెనమలూరుకు చెందిన వెలగా అజయ్‌భాస్కర్‌, మైనేని దుర్గాప్రసాద్‌, పెడన మండలం కొంతెపూడికి చెందిన లుక్కా వీర రాఘవులును అరెస్టు చేశారు. ముంబయిలోని వ్యక్తితో వీరికి ఉన్న సంబంధాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి