Share this on your social network:
Published:
16-03-2017

అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌మ్మంటారు... వెళ్లారా ఇక అంతే ఇరుక్కుపోతారు... కావాల్సినంత డబ్బు గుంజుతారు. ఇలా వలలో పడి ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు రంగంలోనికి దిగారు. ఆ ముఠా గుట్టును రట్టు చేయాలని పోలీసులు చేసిన ప్రయత్నం సఫలమైంది. బాధితుడి ద్వారా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ముఠాలోని ఓ సభ్యుడిని పిలిపించి పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి కొండపల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అని తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం కొండపల్లిలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కొండపల్లికి చెందిన ఓ ముఠా ప్రభుత్వ ఉద్యోగులను ముందుగా గుర్తిస్తారు. వారిలో ఆడవారికి లొంగిపోయే మనస్తత్వం ఉన్న వారిని ఎంచుకుంటారు. వారి చరవాణి నంబర్లు సంపాదించి ముఠాలోని మహిళతో ఫోన్‌లో మాట్లాడిస్తారు. అలా ఆ వ్యక్తిని ఆ మహిళ తన ఇంటికి రప్పిస్తుంది. ఆమె సంబంధిత వ్యక్తితో సన్నిహితంగా వ్యవహరిస్తుంది. ఆ సమయంలో ముఠాలోని సభ్యులు రహస్యంగా చరవాణిల్లో చిత్రీకరిస్తారు. మరుసటి రోజు నుంచి ఉద్యోగికి ఆ చిత్రాలు, వీడియోలు చూపించి బెదిరింపులు ప్రారంభిస్తారు. నగదు వసూలు చేస్తారు. ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇతర మార్గాల నుంచి ఉద్యోగికి వచ్చే డబ్బులను లాక్కోవడం వంటి పనులు చేస్తారు. బెదిరింపులకు లొంగని వ్యక్తులపై దాడి కూడా చేస్తారు. గుంటుపల్లి వ్యాగన్‌ వర్క్‌షాపునకు చెందిన ఓ ఉద్యోగి ఈ ముఠా వలలో పడ్డాడు. గత పదిహేను రోజుల నుంచి అతనికి ఫోన్లు చేయడంతో కొండపల్లిలోని ఓ ఇంటికి ఉద్యోగి వెళ్లాడు. మరుసటి రోజు నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. దీంతో బాధితుడు మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు. నగదు ఇస్తానని చెప్పి బాధితుడి చేత సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేయించారు. ఇబ్రహీంపట్నం రింగ్‌కు వచ్చిన ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఇదే ముఠా కొండపల్లి బి.కాలనీలో ఉండే ఓ వ్యక్తిని కూడా బెదిరించింది. బాధితుడు బంగారు వస్తువులన్నీ పోగొట్టుకున్న తరువాత బంధువులకు విషయం చెప్పడంతో సెటిల్‌మెంట్‌ చేసి కథ ముగించారు. ఆ ముఠా చేసిన ఆగడాలన్నీ ప్రస్తుతం వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడ్ని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి