Share this on your social network:
Published:
11-05-2017

ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 6.80 లక్షల విలువ చేసే బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ త్రిపాఠి తెలిపారు. గుంటూరు అర్బన్‌ పరిధిలో ఇళ్లలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని ఎస్పీ త్రిపాఠి ఆదేశించారు. దీంతో నేరవిభాగ ఏఎస్పీ తిరుపాల్‌ నేతృత్వంలో డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ బాల మురళీకృష్ణ, ఎస్సై కరీముల్లా తమ బృందాలతో గాలింపులు చేపట్టారు. బుధవారం పాతగుంటూరు మణిహోటల్‌ సెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. విజయవాడ రాజేశ్వరరావుపేటకు చెందిన మండాల రాజు, విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ముంగి నరసింహారావులుగా తెలిపారు. వారి వద్ద సోదా చేస్తే జేబులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు విచారిస్తే పాతగుంటూరు మణిపురం 2వ లైనులోని ఓ ఇంట్లో, అరండల్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఒక ఇంట్లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ బంగారు వస్తువులు విక్రయించటానికి యత్నిస్తుండగా పోలీసు సీఐ, ఎస్సైలతోపాటు సిబ్బంది అనిల్‌, సాగర్‌, కిషోర్‌, బాలాజీ, శ్రీధర్‌లు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ. 6.80 లక్షల విలువ చేసే 243 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి