Share this on your social network:
Published:
19-04-2017

నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 10కిలోల ఇథలిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని, వినియోగించే వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇది కలిసిన గాలిని పీల్చడం వల్లే.. మగత, మైకము, తలనొప్పి, వికారం, నీరసం వంటివి వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటిది పొడిని నేరుగా పండ్ల మధ్యలో పెట్టడం వల్ల మరింత ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఈ పొట్లాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడం పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. ప్యాకెట్లలో ఏముందనే.. రసాయనాల వివరాలు ఏవీ లేకుండా ఉండడం మరింత ప్రమాదకరం. కాల్షియం కార్బైడ్‌ కంటే ప్రస్తుతం వ్యాపారులు వినియోగిస్తున్న ఇథలిన్‌ ప్రమాదకరమైనదని అధికారులు చెబుతున్నారు. కాల్షియం కార్బైడ్‌ ఉంటేనే.. శ్వాసకోశ ఇబ్బందులు సహా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటిది అంతకంటే ప్రమాదకరమంటే.. ఆలోచించాల్సిందే. చైనా ఇథలిన్‌ ప్యాకెట్లను ఎంతవరకూ నమ్మొచ్చనేది అనుమానం. మామిడి కాయలను తాము ఏర్పాటు చేసిన ఛాంబర్లలో మగ్గించుకోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. సరిపోయినన్ని లేవనేది వ్యాపారుల వాదన. ఒక్కసారి 300 టన్నుల మామిడి మార్కెట్‌కు వస్తే వాటిని మగ్గించేంత సామర్థ్యం ఇక్కడ లేదన్నారు. అందుకే.. అక్కడ వినియోగించే ఇథలిన్‌ గ్యాస్‌కు బదులుగా పౌడర్‌ను వాడుతున్నామంటున్నారు. హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ప్రస్తుతం ఈ ప్యాకెట్లను వినియోగిస్తున్నారని, ఇక్కడ మాత్రం వద్దంటే తాము పూర్తిగా వ్యాపారాలు చేసుకోలేమని, దానివల్ల రైతులకే నష్టమని వారంటున్నారు. నున్న మార్కెట్‌లో 80 దుకాణాలుండగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ 10 మాత్రమే తెరుచుకున్నాయని, ఇప్పుడు ఇలా వేధిస్తే.. అవికూడా మూసేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాది వ్యాపారులు ఇక్కడి పండ్లు బాగాలేవంటూ రావడం మానేశారని, చిత్తూరు, రాయచూర్‌ మార్కెట్‌లలోని పండ్లపై ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అధికారులు ఇలా దాడులు చేస్తే.. రైతులకే నష్టమంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయంలో మంగళవారం సాయంత్రం కూడా రైతులు, వ్యాపారులు కలిసి నున్న మార్కెట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న వైకాపా నాయకులు, మాజీ మంత్రి పార్థసారథి మార్కెట్‌కు వచ్చి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఇథలిన్‌ వాడమని మార్కెట్‌ కమిటీ వాళ్లే చెప్పారని, ఇప్పుడుచూస్తే.. అధికారులు దాడులు జరుపుతున్నారన్నారు. అయితే ఈ ఎథిలీన్‌ ప్యాకెట్లను ఎక్కడ నుంచి తెచ్చారనేది మాత్రం వ్యాపారులు చెప్పలేడం లేదు.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి