Share this on your social network:
Published:
23-04-2017

యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తిమ్మిరి కిరణ్‌కుమార్‌ అనే యువకుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుడైన పొలిమెట్ల శ్రీకాంత్‌ను కృష్ణలంక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ నెల 18న సాయంత్రం 4.30 ల సమయంలో లబ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలంలో తిమ్మిరి కిరణ్‌కుమార్‌, రవితేజ, కార్తీక్‌, వంశీకృష్ణ, రేవంత్‌, చందు, పవన్‌, ఆది, అవినాష్‌ తిదితరులు క్రికెట్‌ ఆడుతున్నారు. సుమారు 4.45 గంటల సమయంలో చందు అనే యువకుడు బాల్‌ను కొట్టగా అది సమీపంలో ఉన్న దేవకీదేవి అనే మహిళకు తగిలింది. క్రికెట్‌ ఆడుతున్న వారంతా ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో మేడపై నుంచి చూస్తున్న దేవకీదేవి కుమారుడు శ్రీకాంత్‌ అక్కడకు వచ్చి వారందరినీ దుర్భాషలాడారు. కిరణ్‌కుమార్‌ ఈ విషయమై కల్పించుకోగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. గతంలో శ్రీకాంత్‌, కిరణ్‌కుమార్‌ల మధ్య గొడవలు ఉన్నాయని ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న శ్రీకాంత్‌ కోపంతో ఇంట్లోకి వెళ్లి ఒక చాకును తీసుకువచ్చి కిరణ్‌కుమార్‌ ఛాతిలో ఎడమవైపు పొడిచాడు. దీంతో అతను కుప్పకూలిపోగా బంధువులు, చుట్టుపక్కల వారు అతనిని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు నిందితుడి శ్రీకాంత్‌ కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం పి అండ్‌ టి క్వార్టర్లలోకి దొంగచాటుగా వస్తుండగా కృష్ణలంక సీఐ చంద్రశేఖర్‌ తన సిబ్బంది సాయంతో శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. సమీపంలోని పొదల్లో పడేసిన చాకును స్వాధీనం చేసుకున్నారు.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి