Share this on your social network:
Published:
11-05-2017

ఏపీ మ‌హిళా కాంగ్రెస్ మోదీకి గాజులు పంపి వినూత్న నిర‌స‌న

అసమర్ధ ప్రధాని నరేంద్రమోదీ కేవ‌లం త‌న ప్రసంగాలతోనూ, ప్రచారాలతోనూ కాలం వెలిబుచ్చుతున్నార‌ని, భారత సైనికులకు దేశం యావ‌త్తూ అండగా ఉండాలని ఏపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవ‌లంభిస్తోంద‌ని పేర్కొంటూ అందుకు వ్యతిరేకంగా ఏపి మహిళా కాంగ్రెస్ అధ్వర్యంలో ఏపిసిసి రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఉద‌యం వినుత్న నిరసన కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీకి గాజులు పంపించి ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో సుంకర పద్మశ్రీ మట్లాడుతూ బిజేపి పాలనలో దేశ ప్రజతో పాటు జవాన్ల‌కు కూడా ర‌క్షణ కరువైంద‌న్నారు. మోదీ అసమర్థత వలన పాక్ సైన్యం రెచ్చిపోతోందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి 250 మందికి పైగా భార‌త జవాన్‌ల‌ను పాక్ సైన్యం ఊచుకోత కోసిందన్నారు. భారత్ జవాన్‌ల ప్రాణాలను కాపాడంలో మోదీ పూర్తిగా విఫలమ‌య్యార‌ని ఆరోపించారు. గ‌తంలో పాకిస్తాన్ భారత్ సైనికులపై దాడి చేసిన సమయంలో మన్మోహన్‌సింగ్‌కి గాజులు పంపిన స్మృతీఇరానీ.. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం భారత్ జవాన్‌ల తలలు నరుకుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము పంపిన గాజుల‌ను ఇరానీ మోదీకి తొడగాల‌ని ఏపీ మహిళా కాంగ్రెస్ తరుపున డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో ఏపి మహిళా నాయకులు వజ్రపు లెవియ బాబ్జి, జక్కుల ఇందిరాగాంధీ, ప్రమీలగాంధీ, రెహనా తదితరులు పాల్గొన్నారు.

Related Images



Related News


ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేది క‌వులేః తుర్ల‌పాటి కుటుంబ‌రావు

ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కవులు సూత్రదారులుగా ఉంటారని గ్రంథా


నిలిచిపోయిన కేశినేని ట్రావెల్స్ బస్సులు

కేశినేని ట్రావెల్స్ బస్సు చక్రాలు ఆగిపోయాయి. ప్రజా రవాణా రంగంలో దశాబ్


మ‌త్స్య‌కారుల‌కు రూ.31.41 ల‌క్ష‌ల విలువైన సామ‌గ్రి అంద‌జేత‌

మ‌త్స్య‌కారులు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు స‌ద్వినియోగం చే


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో చంద్ర‌బాబు భేటీ

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో డేటా


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


బీజేపి,టిడిపి పాల‌న‌లో కార్మికుల దోపిడిఃఏపీ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు ఎన్.ర‌ఘువీరారెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తు


ఏపీ మ‌హిళా కాంగ్రెస్ మోదీకి గాజులు పంపి వినూత్న నిర‌స‌న

అసమర్ధ ప్రధాని నరేంద్రమోదీ కేవ‌లం త‌న ప్రసంగాలతోనూ, ప్రచారాలతోనూ కాల