Share this on your social network:
Published:
07-05-2017

2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల్‌ పైవంతెన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణ లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న సర్వీసు రోడ్లు కొంత తగ్గించే అవకాశం ఉంది. ఒకవైపు 1.5 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్డు కుంచించుకుపోనుంది. భవిష్యత్తులో దీన్ని విస్తరించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బెంజి సర్కిల్‌ పైవంతెన ఆకృతులు ఖరారు కావడంతో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరోసారి మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టరు సురేష్‌ చెప్పారు. ఒకవైపు నిర్మాణం ప్రారంభిస్తూనే మరోవైపు ఈపీసీ టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికరంగా ఉన్నారు. విజయవాడ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న బెంజి సర్కిల్‌ రూపురేఖలు మారకుండానే అపురూపమైన పైవంతెన నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారయ్యాయి. కేవలం 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలోనే రెండో సుందర పైవంతెనగా దీన్ని నిర్మాణం చేయాలన్నారు. బెంజి సర్కిల్‌ పైవంతెన అదనంగా పొడిగించిన దానికి మళ్లీ ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఒకవైపు నిర్మాణం చేపట్టి మరోవైపు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిస్థాయి పనులకు ఆకృతులు రూపొందించారు. ప్రస్తుతం ఎలాంటి భూసేకరణ, భవనాల తొలగింపు లేకుండానే ఈ పైవంతెన నిర్మాణం చేయడం విశేషం. బెంజిసర్కిల్‌ పైవంతెన ఆకృతులకు ఆర్‌కే అసోసియేట్స్‌ రూపొందించింది. ఉజ్జయిని నగరంలో ఉన్న పైవంతెన తరహాలో దీని ఆకృతులు రూపొందించారు. బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్‌ పైవంతెన కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనిలో 64.6 కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనిలో నాలుగు మేజర్‌, అయిదు చిన్న, అయిదు పాదచారుల వంతెనలు నిర్మాణం చేయనున్నారు.

Related ImagesRelated News


ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేది క‌వులేః తుర్ల‌పాటి కుటుంబ‌రావు

ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కవులు సూత్రదారులుగా ఉంటారని గ్రంథా


నిలిచిపోయిన కేశినేని ట్రావెల్స్ బస్సులు

కేశినేని ట్రావెల్స్ బస్సు చక్రాలు ఆగిపోయాయి. ప్రజా రవాణా రంగంలో దశాబ్


మ‌త్స్య‌కారుల‌కు రూ.31.41 ల‌క్ష‌ల విలువైన సామ‌గ్రి అంద‌జేత‌

మ‌త్స్య‌కారులు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు స‌ద్వినియోగం చే


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో చంద్ర‌బాబు భేటీ

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో డేటా


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


బీజేపి,టిడిపి పాల‌న‌లో కార్మికుల దోపిడిఃఏపీ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు ఎన్.ర‌ఘువీరారెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తు


ఏపీ మ‌హిళా కాంగ్రెస్ మోదీకి గాజులు పంపి వినూత్న నిర‌స‌న

అసమర్ధ ప్రధాని నరేంద్రమోదీ కేవ‌లం త‌న ప్రసంగాలతోనూ, ప్రచారాలతోనూ కాల