Share this on your social network:
Published:
07-05-2017

డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో చంద్ర‌బాబు భేటీ

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో భేటీ అయ్యారు. డల్లాస్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు బెల్‌ హెలికాప్టర్‌ డైరెక్టర్‌ చాద్‌ స్పార్క్‌తో భేటీ అయ్యారు. ఏపీలో తయారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తామని చాద్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనతో మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పౌరవిమాన విధానం ఇప్పటికే తీసుకొచ్చామన్నారు. 75 మిలియన్‌ డాలర్లకు మించి పెట్టుబడులకు టైలర్‌ మేడ్‌ పాలసీ సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రానికి వచ్చి తమ అధికారులతో మాట్లాడాలని బెల్‌కు సూచించారు. అనంతరం ఐటీ సేవల రంగంలో పేరొందిన 28 సంస్థలకు చెందిన ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజ్‌ స్థలాల్లో కార్యకలాపాలకు ఆయా సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీంతో ప్రాథమిక దశలో విశాఖలో 310, అమరావతిలో 65 ఉద్యోగాలు కల్పించనున్నారు.

Related Images



Related News


ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేది క‌వులేః తుర్ల‌పాటి కుటుంబ‌రావు

ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కవులు సూత్రదారులుగా ఉంటారని గ్రంథా


నిలిచిపోయిన కేశినేని ట్రావెల్స్ బస్సులు

కేశినేని ట్రావెల్స్ బస్సు చక్రాలు ఆగిపోయాయి. ప్రజా రవాణా రంగంలో దశాబ్


మ‌త్స్య‌కారుల‌కు రూ.31.41 ల‌క్ష‌ల విలువైన సామ‌గ్రి అంద‌జేత‌

మ‌త్స్య‌కారులు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు స‌ద్వినియోగం చే


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో చంద్ర‌బాబు భేటీ

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో డేటా


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


బీజేపి,టిడిపి పాల‌న‌లో కార్మికుల దోపిడిఃఏపీ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు ఎన్.ర‌ఘువీరారెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తు


ఏపీ మ‌హిళా కాంగ్రెస్ మోదీకి గాజులు పంపి వినూత్న నిర‌స‌న

అసమర్ధ ప్రధాని నరేంద్రమోదీ కేవ‌లం త‌న ప్రసంగాలతోనూ, ప్రచారాలతోనూ కాల