Share this on your social network:
Published:
19-05-2017

మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశంలో మిర్చి,ప‌సుపు పండించిన రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించేవిధంగా ఈనెల 20వ తేది జ‌గ్గ‌య్య‌పేట‌,21వ తేది నందిగామ మార్కెట్ లో మిర్చి కొనుగోలు,22వ తేది కంకిపాడు యార్డుల‌లో ప‌సుపు కొనుగోలు చేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. కొనుగోలు,అమ్మ‌కందారుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా మార్కెట్ల‌లో ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున‌మ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.ముఖ్యంగా పంట‌ల‌ను అమ్ముకునే రైతుల‌ను వాటిని కొనుగోలు చేసే వ‌ర్త‌కుల‌ను మాత్ర‌మే యార్డులోకి అనుమ‌తించ‌టం జ‌రుగుతుంద‌న్నారు. అదేవిధంగా విజ‌య‌వాడ మెట్రో రైలు,బెంజ్ స‌ర్కిల్ ఫ్లై ఓవ‌ర్ బంద‌రు రోడ్డు ప‌నుల్లో గుత్తేదారులు,సంబంధిత అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్వ‌వ‌హ‌రించి ప‌నులు వేగ‌వంతం అయ్యేవిధంగా ప‌ని చేయాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. మెట్రో,ఫ్లై ఓవ‌ర్,పోర్టు రోడ్ల ప‌నుల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి కార్యాల‌యం సానుకూల దృక్పంతో ఉన్నందున చిన్న చిన్న స‌మ‌స్య‌లు చూపించి ప‌నులు జాప్యం జ‌ర‌గ‌కుండా అధికారులు ప‌ని చేయాల‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.మోట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ ప్ర‌తిపాదించిన సి.ఆర్.డి.ఎ విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ రోడ్లు భ‌వ‌నాల శాఖ‌లు రోడ్డు ప‌నులు ప్రారంభించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ,ఇప్ప‌టికే మెట్రో రైలుకు సంబంధించి భూ సేక‌ర‌ణ కోసం నోటిఫికేష‌న్ జారీ చేయ‌ట‌మైంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.ప్ర‌తిపాదిత ప్రాంతాల‌లో సి.ఆర్.డి.ఎ,వి.ఎమ్.సి,ఆర్ అండ్ బి శాఖ‌లు ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపాల‌న్నారు. ట్రాన్స్ కో ,డిస్కం లు నిర్డేశించే మార్గ‌ల‌లో హెచ్ టి లైనుతో పాటు క‌రెంటు స్థంబాలు తొల‌గించే విధంగా ప‌నులు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. దీని కోసం అవ‌స‌ర‌మైన అనుమ‌తులును మెట్రో రైలు సంస్థ తో పాటు జిల్లా యంత్రాంగాం మంజూరు చేయటం జ‌రుగుతుంద‌న్నారు. ట్రాఫిక్ ను నియంత్రించ‌డానికి గుడివాడ బైపాస్ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని ఆర్ అండ్ బి అధికారి ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్రాజెక్టుకు కావ‌ల‌సిన ఇసుక‌ను వినియోగించుకునేందుకు ప‌ట్టా స్థ‌లాల‌లో ఇసుక తవ్వ‌కాల‌కు అనుమ‌తులు జారీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ఇసుక ర‌వాణాలో ప్ర‌భుత్వం ఖ‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అవ‌లంభిస్తుంద‌ని ఎట్టి ప‌ర‌స్థితులోను ఇసుక తవ్వ‌కాల‌కు ప్రోక్లెయిన్ ల‌ను అనుమ‌తించేది లేద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.ప్ర‌భుత్వ అవ‌స‌రాల‌కు ఇసుక ర‌వాణాకు ఎటువంటి ఆటంకాలు లేవ‌ని చ‌ట్ట‌విరుద్ధంగా ఇసుక ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Related ImagesRelated News


సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః కాల్‌సెంట‌ర్‌ను ప్రారంభించిన సీఎం

నీతివంత‌మైన అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిష్యార వేదిక ఒక సాధ


రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలి


బీసీల అభ్యున్న‌తిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది ప్ర‌త్యేక దృష్టిః పురందేశ్వ‌రీ

బీసీల అభ్యున్నతిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కే


గృహ‌నిర్మాణ శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ కావాలిఃకలెక్ట‌ర్

గృహ‌నిర్మాణ‌శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను నూరుశాతం గ్రౌడ


పొన్న‌వ‌రాన్ని దేశానికే ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాంః సుజ‌నాచౌద‌రి

దేశానికే ఆద‌ర్శ‌గ్రామంగా పొన్న‌వ‌రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామ‌ని,


ఉపాధిహామీ,న‌గ‌దుర‌హిత చెల్లింపులు,ఫించ‌న్లు పంపిణీల‌లో రాష్ట్రంలోమొద‌టి స్థానం కృష్ణాజిల్లా

ఉపాధి హామీ ప‌నులు,ఫించ‌నుల పంపిణీపై ఆదివారం జిల్లా క‌లెక్ట‌రు బి.ల‌క్


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


టిడీపీ పాల‌న‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయిః మీసాల రాజేశ్వ‌రావు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఉపాధి లేక లక్షల మంది రైతు


ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర


స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్


జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్


అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అ


మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మా


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ల‌వాణి కాల్ సెంట‌ర్ ప్రారంభం

ఏపీలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పా