Share this on your social network:
Published:
27-04-2017

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలిక వ‌స‌తుల‌ను మ‌రింత అభివృద్ధిప‌ర‌చి స‌ద్వినియోగ‌ప‌ర్చాల‌ని మార్కెటింగ్,ఎస్టేట్ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం ఆదేశించారు. న‌గ‌రంలోని స్వ‌రాజ్య‌మైదాన్ రైతుబ‌జారును గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ ఆక‌స్మీకంగా త‌నిఖీలు చేశారు.అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రైతుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడి వారికి ఆర్థిక ప‌రిపుష్టిని క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన రైతుబ‌జార్ల‌లో ద‌ళారీవ్య‌వ‌స్థ‌కు తావీయ‌కుండా చూడాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉంద‌న్నారు.ఇక‌పై ఇటువంటి చ‌ర్య‌ల‌ను స‌హించేదిలేద‌ని,రైతుబ‌జార్ల‌లో ద‌ళారీల ప్ర‌వేశం ఉన్న‌ట్లు గుర్తిస్తే అందుకు పూర్తిగా ఎస్టేట్ అధికారుల‌నే బాధ్యుల‌ను చేయ‌టం జ‌రుగుతుంద‌న్నారు. వినియోగ‌దారుల‌కు,రైతుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా రైతుబ‌జార్ల‌లో మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటుచేయ‌టం జ‌రిగింద‌ని వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి ప‌రుడుకుంటూ స‌ద్వినియోగం ,చేసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రైతుబ‌జార్ల‌లో విక్ర‌యాలు నిర్వ‌హిస్తున్న రైతుల పంట పొలాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించాల‌న్నారు. గుర్తింపుకార్డు క‌లిగిన రైతులు,వ్య‌క్తులు మాత్ర‌మే త‌ప్ప‌ని స‌రిగా విక్ర‌యాలు నిర్వ‌హించాల‌న్నారు.నాణ్య‌మైన కూర‌గాయ‌లు వినియోగ‌దారుల‌కు అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వేస‌విని దృష్టిలో ఉంచుకొని వినియోగ‌దారుల‌తో రైతుల‌కు ఇబ్బందులు క‌లుగ‌కుండా తాత్కాలిక షేడ్ల‌ను ఏర్పాటుచేయాల‌ని,చ‌ల్ల‌టి త్రాగునీరు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంద‌బాటులో ఉంచాల‌న్నారు.రైతుబ‌జార్లలో పారిశుద్యానికి అత్యంత ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని , వ్య‌ర్థ‌ప‌దార్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌ర‌లించి ప‌రిశుభ్రంగా ఉంచాలన్నారు.

Related Images



Related News


సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః కాల్‌సెంట‌ర్‌ను ప్రారంభించిన సీఎం

నీతివంత‌మైన అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిష్యార వేదిక ఒక సాధ


రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలి


బీసీల అభ్యున్న‌తిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది ప్ర‌త్యేక దృష్టిః పురందేశ్వ‌రీ

బీసీల అభ్యున్నతిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కే


గృహ‌నిర్మాణ శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ కావాలిఃకలెక్ట‌ర్

గృహ‌నిర్మాణ‌శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను నూరుశాతం గ్రౌడ


పొన్న‌వ‌రాన్ని దేశానికే ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాంః సుజ‌నాచౌద‌రి

దేశానికే ఆద‌ర్శ‌గ్రామంగా పొన్న‌వ‌రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామ‌ని,


ఉపాధిహామీ,న‌గ‌దుర‌హిత చెల్లింపులు,ఫించ‌న్లు పంపిణీల‌లో రాష్ట్రంలోమొద‌టి స్థానం కృష్ణాజిల్లా

ఉపాధి హామీ ప‌నులు,ఫించ‌నుల పంపిణీపై ఆదివారం జిల్లా క‌లెక్ట‌రు బి.ల‌క్


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


టిడీపీ పాల‌న‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయిః మీసాల రాజేశ్వ‌రావు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఉపాధి లేక లక్షల మంది రైతు


ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర


స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్


జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్


అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అ


మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మా


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ల‌వాణి కాల్ సెంట‌ర్ ప్రారంభం

ఏపీలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పా