Share this on your social network:
Published:
09-05-2017

రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి కాదని నగదు చెల్లింపు ద్వారా, నగదు రహిత చెల్లింపులలో ఈ రెండింటో ఒకదాని ద్వారా నిత్యావసర సరుకులను తప్పనిసరిగా ప్రజలకు అందజేయాలని అధికారులకు, డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఇందుకు విరుద్దంగా ప్రవర్తించే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. మంగళవారం విజయవాడ సింగ్ న‌గ‌ర్ లో ఆకస్మిక తనిఖీలలో భాగంగా సింగ్‌నగర్ వాంబే కాలనీలో మంత్రి 106వ రేషన్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ షాపు వద్ద కార్డుదారుల నుండి నిత్యావసర వస్తువులు పొందడంపై ఎదురౌతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ సక్రమంగా డీలర్ అందిస్తున్నారా లేదా అని స్థానికులను ప్రశ్నించారు. స్థానిక మహిళలు లింగాల మేరి, లక్మీల ఆధార్ నెంబరులను ఇ-పోస్ యంత్రంలో నమోదు చేసి పరిశీలించారు. సర్వర్ పనిచేయకపోవడం, వేలిముద్రలు సరిపోకపోవడం తదితర సమస్యల వలన సకాలంలో నిత్యావసర సరుకులు పొందలేక ఇబ్బంది పడుతున్నామని నగదు చెల్లింపుల ద్వారా సరుకులు పొందేలా చర్యలు తీసుకోవాలని కార్డుదారులు ముక్తకంఠంతో మంత్రికి విన్నవించుకున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ నగదు రహిత చెల్లింపులు ద్వారా మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం అందించిన అధికారులను గుర్తించాలని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సివిల్ స‌ప్ల‌య్ డైరక్టర్ జి.రవిబాబును ఆదేశించారు. ఆక‌స్మిక త‌నిఖీల్లో మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, జిల్లా పౌర స‌ర‌ఫ‌రాల అధికారి జి.నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related ImagesRelated News


సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః కాల్‌సెంట‌ర్‌ను ప్రారంభించిన సీఎం

నీతివంత‌మైన అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిష్యార వేదిక ఒక సాధ


రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలి


బీసీల అభ్యున్న‌తిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది ప్ర‌త్యేక దృష్టిః పురందేశ్వ‌రీ

బీసీల అభ్యున్నతిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కే


గృహ‌నిర్మాణ శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ కావాలిఃకలెక్ట‌ర్

గృహ‌నిర్మాణ‌శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను నూరుశాతం గ్రౌడ


పొన్న‌వ‌రాన్ని దేశానికే ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాంః సుజ‌నాచౌద‌రి

దేశానికే ఆద‌ర్శ‌గ్రామంగా పొన్న‌వ‌రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామ‌ని,


ఉపాధిహామీ,న‌గ‌దుర‌హిత చెల్లింపులు,ఫించ‌న్లు పంపిణీల‌లో రాష్ట్రంలోమొద‌టి స్థానం కృష్ణాజిల్లా

ఉపాధి హామీ ప‌నులు,ఫించ‌నుల పంపిణీపై ఆదివారం జిల్లా క‌లెక్ట‌రు బి.ల‌క్


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


టిడీపీ పాల‌న‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయిః మీసాల రాజేశ్వ‌రావు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఉపాధి లేక లక్షల మంది రైతు


ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర


స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్


జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్


అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అ


మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మా


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ల‌వాణి కాల్ సెంట‌ర్ ప్రారంభం

ఏపీలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పా