Share this on your social network:
Published:
11-05-2017

ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య మ‌రియు ఫ్యామిలీ వెల్ ఫేర్ శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా సూచించ‌డంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ‌మంత్రి సిద్ధార్ధ‌నాథ్ సింగ్ ఆధ్వ‌ర్యంలో బృందం వాటిని యూపీ రాష్ట్రంలో అమ‌లు చేయ‌టానికి వ‌చ్చారిన ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ తెలిపారు. భార‌త‌దేశంలోని రాష్ట్రాల‌లో ఏ రాష్ట్రంలో ఆరోగ్య‌ప‌రంగా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందుతున్నాయో ఆ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అమ‌లు చేయ‌డానికి నిర్ణ‌యించి కేంద్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఆరోగ్య ప‌థకాల‌ను స‌వ్యంగా అమ‌లు చేస్తున్న‌ట్టు చెప్పార‌న్నారు. దీనికి తోడు నీతిఆయోగ్ ఉపాధ్య‌క్ష‌లు అర‌వింద్ ప‌న్ గ‌రియా కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించి వైద్యం,ఇన్సూరెన్స్ ప‌రంగా ప్ర‌భుత్వం మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తుంద‌ని స‌ల‌హా ఇచ్చార‌ని దాంతో యూపీ ఆరోగ్య‌మంత్రి ఆధ్వ‌ర్యంలో గురువారం రాష్ట్రానికి వ‌చ్చార‌ని,రాష్ట్రంలో అమ‌లు జ‌రుగుతున్న ఆరోగ్య ప‌థ‌కాల‌పై వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఆ ప‌థ‌కాల వివ‌రాల‌ను హెల్త్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పూనం మాల‌కొండ‌య్య త‌దిత‌ర అధికారుల ఆధ్వ‌ర్యంలో బృందం వివ‌రించింద‌ని తెలిపారు.2016-17 సంవ‌త్స‌రంలో రాష్ట్రంలో 26కొత్త ఇనీషియోష‌న్స్ తీసుకొచ్చామ‌ని ఆందులో కొన్ని ఎన్ టి ఆర్ వైద్య సేవ ,త‌ల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్,బేబికిట్స్ త‌దిత‌ర‌మైన‌వి ఉన్నాయ‌న్నారు. రాష్ట్రంలో వివిధ స్కీంలు అందించ‌టం వ‌ల్ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఓపి శాతం ,డెలివ‌రీల శాతం పెరిగింద‌న్నారు.ముఖ్యంగా శానిటేష‌న్ మెరుగుప‌డింద‌న్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య‌మంత్రి సిద్దార్థ‌నాథ్ సింగ్ మాట్లుడుతూ ఆరోగ్య‌మంత్రిగా రాష్ట్రానికి మొట్ట‌మొద‌ట సంద‌ర్శించాన‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హెల్త్ స్వీములు చాలా బాగా అమలుచేస్తున్నార‌న్నారు. భార‌త ప్ర‌భుత్వం కూడా వీటిని గుర్తించింద‌న్నారు. అందుకోస‌మే ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంతో క‌లిసి ముందుకు వెళ్ల‌డానికి ఈ రాష్ట్ర ప‌ర్య‌ట‌న వ‌చ్చి తెలుసుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు . ఏపీలో అమల‌వుతున్న 108,102 అంబులెన్స్ సౌక‌ర్యాన్ని యూపీ లో కూడా అమలు చేస్తామ‌న్నారు. ప‌బ్లిక్ ప్ర‌యివేట్ పార్టిస్ పెంట్ మోడ‌ల్ ను ఇంప్రూవ్ చేస్తాం అని ఆయ‌న తెలిపారు.ఏపీలో ఆన్ లైన్ లో బ్ల‌డ్ బ్యాంక్స్ అందుబాటులో కి రావ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని ఈస్ట్ర‌న్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఈ విష‌యంలో ఇబ్బందులు ఉన్నాయ‌ని చెప్పారు. గ‌త 3 సంవ‌త్స‌రాలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆరోగ్యాంద్ర‌గా వెల‌గొందుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

Related Images



Related News


సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః కాల్‌సెంట‌ర్‌ను ప్రారంభించిన సీఎం

నీతివంత‌మైన అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిష్యార వేదిక ఒక సాధ


రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలి


బీసీల అభ్యున్న‌తిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది ప్ర‌త్యేక దృష్టిః పురందేశ్వ‌రీ

బీసీల అభ్యున్నతిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కే


గృహ‌నిర్మాణ శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ కావాలిఃకలెక్ట‌ర్

గృహ‌నిర్మాణ‌శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను నూరుశాతం గ్రౌడ


పొన్న‌వ‌రాన్ని దేశానికే ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాంః సుజ‌నాచౌద‌రి

దేశానికే ఆద‌ర్శ‌గ్రామంగా పొన్న‌వ‌రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామ‌ని,


ఉపాధిహామీ,న‌గ‌దుర‌హిత చెల్లింపులు,ఫించ‌న్లు పంపిణీల‌లో రాష్ట్రంలోమొద‌టి స్థానం కృష్ణాజిల్లా

ఉపాధి హామీ ప‌నులు,ఫించ‌నుల పంపిణీపై ఆదివారం జిల్లా క‌లెక్ట‌రు బి.ల‌క్


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


టిడీపీ పాల‌న‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయిః మీసాల రాజేశ్వ‌రావు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఉపాధి లేక లక్షల మంది రైతు


ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర


స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్


జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్


అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అ


మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మా


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ల‌వాణి కాల్ సెంట‌ర్ ప్రారంభం

ఏపీలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పా