Share this on your social network:
Published:
05-07-2020

చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!

చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చెరువుల్లో చేపల్నే తింటారు. చెరువులతోపాటూ... సముద్ర చేపల్ని కూడా తినాలి. ఏ చేపలు తిన్నా... అవి బీపీని, కొలెస్ట్రాల్‌ని, డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తాయి. చేపల్లో కొవ్వు తక్కువ, నాణ్యమైన ప్రోటీన్స్ లభిస్తాయి. వారానికి రెండుసార్లైనా చేపను తినాలి. తద్వారా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధింత సమస్యల నుంచీ బయటపడవచ్చు. తీర ప్రాంతాల్లో ప్రజలు చేపల్ని రెగ్యులర్‌గా తింటున్నారు. అందువల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా చేపల్ని తింటే... పుట్టే పిల్లలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు. చేపల్ని ఎలాగైనా తినవచ్చు. వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బేకింగ్ చేసి తినవచ్చు. ఎంతో రుచికి తోడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. మన శరీరంలో ప్రతీ కణానికీ ప్రోటీన్ అవసరమే. సరిపడా ప్రోటీన్స్ అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే శరీరంతోపాటూ రక్తం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చేపలు లభించని ప్రాంతాల్లో ప్రజలకు ప్రోటీన్స్ కొరత ఏర్పడుతోంది. చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...! చేపల్ని చూడాగానే చాలా మంది అమ్మో ఫ్యాట్ అంటూ భయపడతారు. నిజానికి చేపల్లో ఉండేది మంచి కొవ్వు. అది మన శరీరానికి చాలా అవసరం. చేపల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన గుండెను హార్ట్ ఎటాక్స్ నుంచీ కాపాడతాయి. ఇక ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో తయారవ్వవు. వాటిని చేపల్లాంటి వాటి ద్వారా పొందగలం. వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, కడుపులో మంటలు, వేడి తగ్గాలన్నా చేపలు తినాలి. అర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి చేపలు సరైన మందు. ఇవి నొప్పిని తగ్గించి, కండరాలకు శక్తిని ఇస్తాయి. డిప్రెషన్, అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరపు లాంటి లక్షణాల్ని చేపలు తగ్గిస్తాయి. ఎక్కువగా సాల్మన్, సార్డిన్స్, మాకెరెల్, ట్రౌట్, హెర్రింగ్, ట్యూనా చేపలు తింటే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ఎముకల్ని గట్టిగా చేసే విటమిన్-D చేపల్లో ఉంటుంది. రొమ్ము కాన్సర్, పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్, ఒయిసోఫాగస్ వంటి కాన్సర్లకు చేపలు చెక్ పెడతాయి. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిది. చేపల్లో విటమిన్ B2 రైబోఫ్లావిన్ కూడా ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలుచేస్తుంది. బాడీ ఆక్సిజన్ తీసుకునేలా ఇది చేస్తుంది. *చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...* - చేపల్లోని ఐరన్... రక్తంలోని హిమోగ్లోబిన్‌ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేయగలదు. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఎనర్జీ ఉండాలంటే ఐరన్ కావాలి. అందుకోసం చేపలు తినాలి.- చేపల్లో ఉండే జింక్... వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. - చేపల్లోని అయోడిన్.... ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ మెదడు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సరిగా పనిచెయ్యడానికి, గాయిటర్ పాడవకుండా చెయ్యడానికీ చేపలు తినాలి. - చేపల్లోని మెగ్నీషియం... మన బాడీలో కూడా ఉంటుంది. అది సరిపడా లేకపోతే చాలా ఇబ్బంది. కాల్షియం మెటబాలిజంను సెట్ చెయ్యడానికి మెగ్నీషియం అవసరం. మీకు తెలుసు కాల్షియం వల్లే ఎముకలు బలంగా ఉంటాయని. కాల్షియంకి మెగ్నీషియం తోడైతే ఎంతో మేలు. - చేపల్లోని పొటాషియం... శరీరంలో ద్రవాలకు చాలా అవసరమైన పోషకం. కణాలు సమర్థంగా పనిచెయ్యడానికి పొటాషియం కావాలి. పొటాషియం తగ్గితే... హైబీపీ వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎముకలు పగలగలవు. యూరిన్‌లో కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల పొటాషియం బాగా ఉండే చేపలు తినాలి.

Related Images



Related News


శృంగారం... ఏ వారం!

వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ


క‌డుపులో గ్యాసా... అల్లం ఉందిగా

రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే


ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, ఒత్తిడికి... ప్ర‌కృతే మందు

ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌


ఆక‌లి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...

‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్


నీరు ఎక్కువ‌... అంద‌మూ ఎక్కువే

టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన


క్యాలరీలను కరిగించే ముద్దు

ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల


తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు

శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప


పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర


ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో


మ‌గ‌మ‌హారాజులూ.... వీర్య క‌ణాలు పెంచుకోండి ఇలా...

వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ


రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చ‌ద‌వండి...

చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద


వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్య‌మండోయ్‌.... చ‌ద‌వండి

ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ


జామ‌పండు... ఎన్నో రోగాల‌కు మందు

జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్‌, ఆక్సాలిన్‌,


కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ

పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ


తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...

వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట


చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!

చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా