Share this on your social network:
Published:
13-03-2017

ఆక‌లి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...

‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్నో ‘మజా, థ్రిల్లు’ వ్యవహారంగా చూడటం.. ఈ రెండు ధోరణులూ తప్పే. ఈ రెండూ పోవాలి. ఏ నాగరీక సమాజమూ కూడా శృంగారాన్ని ఛీఛీ అనదు. దాన్ని మానవ జీవితాల్లో అత్యంత కీలకమైన అంశంగా స్వీకరిస్తుంది. అంతేకాదు, దాన్ని సామాజిక జీవితంలోనూ ముఖ్యమైన అంశంగా గుర్తిస్తుంది. మన పూర్వీకులు కూడా శృంగారాన్ని ఓ అత్యద్భుత కార్యంగా భావించారు. దాన్నో శాస్త్రంలాగా, మానవ మనుగడకు అవసరమైన గౌరవప్రదమైన విజ్ఞానంగా గుర్తించారు. కామసూత్రమే ఇందుకు తార్కాణం. ఇంతటి విశాల దృక్పథం కాస్తా కాలక్రమంలో కుచించుకుపోయి.. క్రమేపీ అపోహల్లోకీ, అర్థరహిత భావనల్లోకీ జారిపోయింది. దీంతో శృంగారమన్నది అన్యోన్యమైన ఆనందాన్నిచ్చే అంశమని కూడా చాలామంది తెలుసుకోవటం లేదు. అదేదో హడావుడిగా చీకట్లో ముగించెయ్యాలన్న తొందరపాటు ధోరణిలో కొట్టుకుపోయే వారూ ఉన్నారు. నిజమైన శృంగారం ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలను ప్రోత్సహిస్తుంది! ‘మన జీవితంలో ఆకలి, నిద్ర మాదిరిగానే శృంగారం కూడా ఒక సహజాతం. సర్వ సహజ భావన. ఇదేమీ చెడ్డ విషయం కాదు. దీనికి మనం లేనిపోని పవిత్రత ఆపాదించి, నైతికపరమైన బంధనాల్లో ఇరికించటం వల్ల లైంగిక ఆరోగ్యం విషయంలో సమాజంలో లేనిపోని అపోహలు, అపనమ్మకాలు, అర్థసత్యాలు, అసత్యాలు రాజ్యమేలుతున్నాయి. అయితే సహజాతం కదా అని మనిషి ఎలాంటి నిబంధనలూ, కట్టుబాట్లూ లేకుండా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతర జంతుజాలం లాగా మనిషి కేవలం సంతానాన్ని కనేసి, సమాజానికి వదిలేసి వెళ్లిపోయే రకం కాదు. మనుషుల విషయంలో పెంపకానికీ అత్యధిక ప్రాధాన్యం ఉంది, ఇందులో స్త్రీపురుషులు ఇరువురికీ నిర్దిష్టమైన పాత్రలున్నాయి. కాబట్టి స్త్రీపురుషుల బాధ్యతలు పడక గదితో ముగిసిపోయేవి కాదు.. తల్లిదండ్రులుగా ఆ తర్వాత కూడా వాళ్లు అంతకు మించిన బాధ్యతలను పోషించాల్సి ఉంటుంది. అందుకే మానవ సమాజానికి వచ్చేసరికి శృంగారానికి పద్ధతులు, నియమాలు పుట్టుకొచ్చాయి. వీటిని మనం కాదనలేం. అలాగని దురవగాహనల్లో కూరుకుపోలేం. శాస్త్రీయ దృక్పథంతో వీటన్నింటినీ పటాపంచలు చేసుకోకపోతే లైంగిక జీవితాన్ని ఆనందించాల్సినంతగా ఆస్వాదించలేమని చెప్పక తప్పదు. ఈ అవగాహన అన్నది పుస్తకాలతో వచ్చేది కాదు. ఇందుకు మొత్తం సామాజిక వైఖరిలోనే మార్పు రావాలి.’

Related Images



Related News


శృంగారం... ఏ వారం!

వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ


క‌డుపులో గ్యాసా... అల్లం ఉందిగా

రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే


ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, ఒత్తిడికి... ప్ర‌కృతే మందు

ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌


ఆక‌లి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...

‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్


నీరు ఎక్కువ‌... అంద‌మూ ఎక్కువే

టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన


క్యాలరీలను కరిగించే ముద్దు

ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల


తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు

శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప


పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర


ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో


మ‌గ‌మ‌హారాజులూ.... వీర్య క‌ణాలు పెంచుకోండి ఇలా...

వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ


రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చ‌ద‌వండి...

చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద


వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్య‌మండోయ్‌.... చ‌ద‌వండి

ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ


జామ‌పండు... ఎన్నో రోగాల‌కు మందు

జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్‌, ఆక్సాలిన్‌,


కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ

పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ


తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...

వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట


చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!

చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా