వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్యమండోయ్.... చదవండి
ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది. ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి, శరీరానికి పట్టించి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి మటుమాయం అవుతుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి.కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే, వికారం మటుమాయం అవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటంవల్ల కోలుకుంటారు. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు. చిన్న పిల్లలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద, కర్పూరం, కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు. గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటంవల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్ వేసి ఆవిరిపడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది
Related Images
Related News
శృంగారం... ఏ వారం!
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ
కడుపులో గ్యాసా... అల్లం ఉందిగా
రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే
ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడికి... ప్రకృతే మందు
ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్
ఆకలి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...
‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్
నీరు ఎక్కువ... అందమూ ఎక్కువే
టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన
క్యాలరీలను కరిగించే ముద్దు
ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల
తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప
పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో
మగమహారాజులూ.... వీర్య కణాలు పెంచుకోండి ఇలా...
వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ
రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చదవండి...
చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద
వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్యమండోయ్.... చదవండి
ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ
జామపండు... ఎన్నో రోగాలకు మందు
జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్, ఆక్సాలిన్,
కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ
పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ
తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా