రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చదవండి...
చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద్రకు భంగం కూడా కలుగుతుంది. అలాగే, మరికొంతమందికి రాత్రిపూట సరిగా నిద్రపట్టదు. పనిఒత్తిడితో పాటు కుటుంబ సమస్యలు, చిరాకు, అలసట వంటి ఇతరత్రా కారణాల వల్ల అనేక మంది నిద్రకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారు కాస్త ఉప్పు తగ్గించిన ఆహారం తీసుకున్నట్టయితే నిద్రతో పాటు పదేపదే మూత్ర విసర్జనకు కూడా చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లటం తగ్గుతున్నట్టు ఐరోపా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఒక్క రాత్రిపూటే కాదు, పగటి పూట కూడా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. శరీరంలో రక్తం పరిమాణం నియంత్రణలో ఉండటంలో ఉప్పు (సోడియం) కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా ఉప్పు ఎక్కువగా తీసుకున్నట్టయితే రక్తంలో సోడియం మోతాదు పెరుగుతుందట. దీనివల్ల కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగిపోతుంది. రక్తం పరిమాణం ఎక్కువైతే మూత్రం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, రక్తం పరిమాణంతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీలు మరింత ఎక్కువగా నీటిని ఒంట్లోంచి బయటకు పంపటానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని కాస్త తగ్గిస్తే.. రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లకుండానే కాదు, కంటినిండా నిద్రపోయేలానూ చూసుకోవచ్చని పరిశోధకులు సెలవిస్తున్నారు.
Related Images
Related News
శృంగారం... ఏ వారం!
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ
కడుపులో గ్యాసా... అల్లం ఉందిగా
రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే
ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడికి... ప్రకృతే మందు
ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్
ఆకలి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...
‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్
నీరు ఎక్కువ... అందమూ ఎక్కువే
టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన
క్యాలరీలను కరిగించే ముద్దు
ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల
తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప
పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో
మగమహారాజులూ.... వీర్య కణాలు పెంచుకోండి ఇలా...
వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ
రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చదవండి...
చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద
వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్యమండోయ్.... చదవండి
ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ
జామపండు... ఎన్నో రోగాలకు మందు
జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్, ఆక్సాలిన్,
కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ
పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ
తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా