Share this on your social network:
Published:
04-05-2020

కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ

పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల నుంచైనా విముక్తి పొందవచ్చు. ఒకవేళ సోకినా వారిపై పెద్దగా ప్రభావం చూపదు. ఇప్పుడు కరోనా వైరస్‌ సోకిన రోగులకు పాటు, క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. వారికి నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించడంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. ఐసోలేషన్‌ వార్డుల్లో, క్వారంటైన్‌లో ఉన్న వారికి ఒక్కొక్కరికీ భోజనానికి రోజుకు రూ.500ల చొప్పున కేటాయిస్తుంది. దీంతో వారికి మూడు పూటల నాణ్యమైన వైద్యం అందించడంతో రోగులు త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నారు. కరోనా వైరస్‌ సోకి చిన ఆవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రి, ఆయుష్‌ ఆస్పత్రిల్లో చికిత్సపొందుతున్న వారితో పాటు, జిల్లాలోని వివిధ క్వారంటైన్‌లో ఉన్న సుమారు 824ల మందికి పోషక విలువలు కలిగిన ఆహారం అందజేస్తున్నారు. అలాగే సిద్ధార్థ వైద్య కళాశాలలోని వైరల్‌ ల్యాబ్‌లో పనిచేస్తున్న 50 మందికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం విజయమేరి, ప్రణీత మహిళా పొదుపు సంఘాల వారికి అప్పగించింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అక్కడి డైట్‌ కాంట్రాక్టర్‌ భోజనాన్ని అందిస్తున్నారు. ఇదీ మెనూ.. ఉదయం: ఇడ్లీ 2+గారె 2, గోధుమరవ్వ ఉప్మా+మైసూర్‌ బజ్జీ 2, తెల్లరవ్వ ఉప్మా+పూరీ 2, టమాటా బాత్‌+పునుగు 2.. రోజు విడిచి రోజూ ఈ మెనూ అందిస్తున్నారు. మధ్యాహ్నం: బాయిల్డ్‌ గుడ్డు, స్వీట్, ఫ్లేవర్‌ రైస్, పప్పు, గుజ్జుకూర, వేపుడు కూర, పచ్చడి, వైట్‌రైస్‌తో పాటు, సాంబారు అన్నం(ప్రత్యేక ప్యాకింగ్‌) పెరుగు అన్నం (ప్రత్యేక ప్యాకింగ్‌) అందజేస్తున్నారు. సాయంత్రం: రోజుకో పండు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, కిస్‌మిస్‌ 100 గ్రాముల ఇస్తారు. వీటితో పాటు చెకోడీ లేదా బూందీ ఇస్తున్నారు. రాత్రి భోజనం: పప్పు, గుజ్జుకూర, వేపుడుకూర, సాంబారు, రసం, వైట్‌రైస్‌ ఇస్తున్నారు. సకల సౌకర్యాలు.. ఐసోలేషన్‌లో ఉన్న వారికి నాణ్యమైన భోజనం పెట్టడమే కాకుండా.. ఒక టవల్, ఒక బక్కెట్, మగ్గుతో పాటు, సబ్బులు, పేస్ట్‌లు వంటి పరికరాలు ఇస్తున్నారు. పురుషులైతే షేవింగ్‌ చేసుకునేందుకు సైతం పరికరాలు అందజేస్తున్నారు. అంతేకాదు డిశ్చార్జి సమయంలో ఒక షర్ట్, రూ.2 వేలు నగదు అందజేస్తున్నారు.

Related Images



Related News


శృంగారం... ఏ వారం!

వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ


క‌డుపులో గ్యాసా... అల్లం ఉందిగా

రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే


ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, ఒత్తిడికి... ప్ర‌కృతే మందు

ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌


ఆక‌లి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...

‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్


నీరు ఎక్కువ‌... అంద‌మూ ఎక్కువే

టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన


క్యాలరీలను కరిగించే ముద్దు

ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల


తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు

శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప


పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర


ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో


మ‌గ‌మ‌హారాజులూ.... వీర్య క‌ణాలు పెంచుకోండి ఇలా...

వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ


రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చ‌ద‌వండి...

చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద


వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్య‌మండోయ్‌.... చ‌ద‌వండి

ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ


జామ‌పండు... ఎన్నో రోగాల‌కు మందు

జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్‌, ఆక్సాలిన్‌,


కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ

పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ


తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...

వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట


చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!

చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా