Share this on your social network:
Published:
19-05-2017

కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించేందుకు ఉద్దేశించిన ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ స‌మ‌గ్ర నివేదిక‌(డి.పి.ఆర్) ఇంత‌వ‌ర‌కు రాష్ట్రం నుంచి కేంద్రానికి చేర‌లేద‌ని న‌ర‌సారావుపేట పార్ల‌మెంట్ స‌భ్యులు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసారు. శుక్ర‌వారం నారా లోకేష్ తో భేటీ అయిన రాయ‌పాటి తాను 1150 కోట్ల అంచ‌నాల‌తో ప‌ల్నాడు ప్రాంతంలో మాచ‌ర్ల‌,వినుకొండ‌, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గాల‌కు త్రాగునీటిని అందించేలా ప‌థ‌కాన్ని త‌యారు చేసి కేంద్రానికి ప్ర‌తిపాద‌న పంపామ‌ని ,భార‌త ప్ర‌ధాని నరేంద్ర‌మోడి సైతం ఈ ప్ర‌తిపాద‌న ప‌ట్ల సానుకూలం గా స్పందించార‌ని తెలిపారు. దీనిపై స‌మ‌గ్ర ప్రాజెక్ట్ రిపోక్ట్ త‌యారు చేసి పంపాల‌ని కేంద్రం,రాష్ట్రాన్ని కోరింద‌ని,ఐతే ఎనిమిది నెల‌లుగా పంచాయితీ రాజ్ శాఖ నుండి డి.పి.ఆర్ కేంద్రానికి చేర‌లేద‌ని రాయ‌పాటి ఫిర్యాదు చేసారు. ఇదే గాకా మాచ‌ర్ల ప్రాంతం లో 94 బోర్ వేల్స్ త‌క్ష‌ణం మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేసించిన‌ప్ప‌టికి జిల్లా ఆర్.డ‌బ్లు.ఎస్.ఎస్.ఈ త‌మ వ‌ద్ద నిధులు లేవంటున్నార‌ని తెలిపారు. 19 కోట్ల రూపాయ‌ల‌తో రెంటచింత‌ల స‌మ‌గ్ర నీటి ప‌థ‌కం,11 కోట్ల రూపాయ‌ల‌తో జెర్రివాగు రెండో ద‌శ నీటి ప‌థ‌కాల‌ను ట్రైబల్ స‌బ్ ప్లాన్ క్రింద నిధుల‌తో చేయాల‌ని కోర‌గా ముఖ్య‌మంత్రి మంజూరుకు ఆదేశించార‌ని వాటిని వెంట‌నే చేప‌ట్టాల‌ని కోరారు. జిల్లా లో పంచాయితీరాజ్ శాఖా ఎస్.ఈ.పోస్ట్ ఖాళీగా ఉంద‌ని వెంట‌నే దానికి భ‌ర్తీ చేయాల‌ని కోరారు. త‌మ స్వ‌గ్రామ‌మైన ఉంగుటూరు కు సైడ్ డ్రైయిన్ల‌కు నిధులు ఇవ్వాల‌ని కోరారు. ఇందుకు స్పందించిన లోకేష్ అధికారుల నిర్ల‌క్ష్య‌పు వైఖ‌రిని ఇక ముందు తాను స‌హించేది లేద‌ని లోకేష్ పేర్కోన్నారు. ఆయ‌న వెంట‌నే త‌న ఓ.ఎస్.డి.రంజిత్ బాషాను పిలిచి వాట‌ర్ గ్రిడ్ ప్ర‌తిపాద‌న‌ల‌తో పాటు,ఇత‌ర ప్రాజెక్ట్ ల‌పై వెంట‌నే నివేద‌న త‌న‌కు అంద‌చేయాల‌ని ,బోర్ వెల్స్ మంజూరు చేయ‌మ‌ని ఆదేశించిన చేయ‌క‌పోవ‌డంపై ఆర్.డ‌బ్లు.ఎస్ ఈ ని వివ‌ర‌ణ కోరుతున్నామ‌న్నారు. రాయ‌పాటి స్వ‌గ్రామ‌మైన ఉంగుటూరు కు సైడ్ కాల్వ‌లు కాకుండా అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి ప్ర‌తిపాద‌న సిద్ధం చేస్తే తీను నిధులు మంజూరు చేస్తాన‌ని లోకేష్ హామీ ఇచ్చారు.

Related ImagesRelated News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే