Share this on your social network:
Published:
27-04-2017

కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన కియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. సచివాలయం లో ఏప్రిల్ 27న (గురువారం) ఉదయం కియా కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ తయారీ కేంద్రంలో ఏటా 3 లక్షల చిన్న కార్లు తయారవుతాయని తెలిపారు. అవకాశం ఉంటే 4 లక్షల కార్ల వరకు తయారయ్యే అవకాశం ఉందన్నారు. 2018 డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుందని పేర్కొన్నారు. 2019 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తారని చెప్పారు. ఇక్కడ తయారయ్యే కార్లలో 90 శాతం దేశీయ మార్కెట్‌లోనే విక్రయిస్తారని, మిగిలిన పది శాతం ఎగుమతి చేస్తారని వివరించారు. ఈ కార్ల ఉత్పత్తి కేంద్రంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా 12 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో, తక్కువ ధర కార్లను ఈ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. 1944లో ప్రారంభమైన కియా కంపెనీకి దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాలలో ప్లాంట్లు ఉన్నాయని, 51 వేల మంది ఉద్యోగలు పని చేస్తున్నట్లు తెలిపారు.

Related Images



Related News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే