Share this on your social network:
Published:
24-04-2017

రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు ఖ‌చ్చితంగా నిత్యావ‌స‌ర వ‌స్తువులు చేరాల‌నే ఉద్దేశ్య‌ముతో రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని చౌక ధ‌ర‌ల దుకాణాల‌లో ఈ-పాస్ విధానంను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగించ‌ని జిల్లా పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి చిట్టిబాబు తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్లోని డిఆర్ సి స‌మావేశంలో తొలుత డిఎస్ ఓ చిట్టిబాబు 24వ తేదీన జ‌రిగిన జిల్లా విజిలెన్స్ క‌మిటీ స‌మావేశంలో స‌భ్యులు ప్ర‌స్తావించిన అంశాల‌పై తీసుకున్న చ‌ర్య‌ల‌న‌ను వివ‌రించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ పాస్ విధానం ద్వారా ప్ర‌తి నెలా 83నుంచి 85శాతం కార్డుదారులు నిత్యావ‌స‌ర స‌రుకులు పొందుచున్నార‌న్నారు.అనారోగ్య‌ముతో మంచాన ప‌డి ఈ-పాస్ నందు వేలు ముద్ర‌లు వేయ‌లేని వారిని దృష్టిలో ఉంచుకొని వారికి కూడా రేష‌న్ అందించాల‌నే మాన‌వ‌తా దృక్ప‌ధంతో మీ ఇంటికి మీ రేష‌న్ అనే ప‌ధ‌కంను ప్ర‌వేశ‌పెట్టి,సంబంధిత విఆర్ఓ ఆధార్ నెంబ‌ర్తో అనుసంధానం చేసిన రేష‌న్ అందిస్తున్న‌ట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని రేష‌న్ షాపుల‌లో న‌గ‌దు చెల్లింపుల‌ను డిజిట‌లైజేష‌న్ చేయు చ‌ర్య‌లలో భాగంగా క్యాష్ లెస్ విధానంను కూడా ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.జిల్లాలోని మొత్తం 14ల‌క్ష‌ల 27వేల 643 రేష‌న్ కార్డుదారుల‌కు ప్ర‌తినెల ఒక‌టో తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు సంబంధిత రేష‌న్ల‌లో నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేయుట‌కు సిద్ధంగా వుండ‌చం జ‌రుగుతుంద‌న్నారు.గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల నుండి మార్చి,2017 వ‌ర‌కు తూనిక‌లు,కొల‌త‌ల‌శాఖ వారు పెట్రోలుబంకులు,గ్యాస్ కంపెనీలు,చౌక ధ‌ర‌ల దుకాణ‌ములు మొద‌ల‌గు వాటిపై మొత్తం 560 త‌నిఖీలు నిర్వ‌హించి,88 కేసులు న‌మోదు చేసి 4ల‌క్ష‌ల 14వేల రూపాయ‌లు అప‌రాధ రుసుము విధించిన‌ట్లు డి.ఎస్.ఓ తెలిపారు.హాస్ట‌ల్స్ కు మ‌రియు మ‌ధ్యాహ్నం భోజ‌న ప‌థ‌కానికి మేలు ర‌కం బియ్యం స‌ర‌ఫ‌రాల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ,మండ‌ల స్తాయిలో ఆహార స‌ల‌హా సంఘ స‌మావేశాలు నిర్ణీత గ‌డువులోపు జ‌ర‌పాల‌ని,ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఖ‌చ్చితంగా ప్ర‌తి చౌక‌ధ‌ర‌ల దుకాణాల‌లో 15తేదీ వ‌ర‌కు రేష‌న్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డిఎస్ఓ చిట్టిబాబు తెలిపారు.

Related ImagesRelated News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే