Share this on your social network:
Published:
10-05-2017

పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్‌లింగో అన్నారు. చైనా ప్రభుత్వ సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు బుధవారం ఉదయం సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్‌లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్,వ్యవసాయ ఉత్పత్తల వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి అమరనాథరెడ్డి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏడీబీ) సీనియర్ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం చైనా, ఏపి బృందాల మధ్య జరిగిన సమావేశంలో ఏపీ అధికారులు రాష్ట్రాభివృద్ధి,పెట్టుబ‌డుల‌కు అవకాశాల గురించి వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. దేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సముద్ర తీరం, అపారంగా ఉన్న వనరులు, ఖనిజసంపద, నైపుణ్యత గల మానవ వనరులు, ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులు వల్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు. ప్రతి ఆర్థిక సంవత్సరం 12 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 2029 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు చెప్పారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ప్రైవేటు పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఇ-గవర్నెస్ లో రాష్ట్ర ప్రగతిని వివరించారు. పరిశ్రమల స్థాపనకు కావలసిన 39 రకాల అనుమతులు 21 రోజుల్లో పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, పెట్రోకెమికల్, లెథర్ టెక్నాలజీ, టెక్సటైల్స్, ఎనర్జీ, లైఫ్ సైన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వివిధ రంగా అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన పాలసీల గురించి వివరించారు. ప్రాంతాలవారీగా పరిశ్రమల స్థాపనకు అవకాశాలను వివరిస్తూ రూపొందించిన మ్యాప్ ను ప్రదర్శించారు. రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని, మరో ఆరు విమానాశ్రయాల నిర్మాణం ప్రతిపాదనలో ఉన్నట్లు వివరించారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక జోన్లు, వాటి మధ్య పారిశ్రామిక మండళ్లు గురించి సవివరంగా తెలిపారు. సముద్ర తీరంవెంట లభించే ఖనిజవనరులు, అందుబాటులో ఉన్న పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల గురించి వివరించారు. రాష్ట్రాన్ని వ్యవసాయ ఉత్సత్తుల ఎగుమతి జోన్ గా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను తెలిపారు. వివిధ రకాల ఖనిజ సంపద, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 17 వందలకుపైగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు స్థాపించినట్లు వివరంచారు. విశాఖలో పెట్రోలియం రిఫైనరీ, పవర్ సెక్టార్ లో చేపట్టిన సంస్కరణలు, పొందిన అవార్డులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు నెలకొల్పనున్నట్లు చెప్పారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు పది జిల్లాల్లో స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, స్థాపించనున్న విద్యా సంస్థల గురించి వివరిస్తూ నాలెడ్జి స్టేట్ గా, విద్యా హబ్ గా రూపొందనున్నట్లు తెలిపారు. చైనా, బ్రిటన్, సింగపూర్, జపాన్, డెన్మార్క్ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో 29 గ్రామాలను కలుపుతూ 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించే నూతన రాజధాని అమరావతి గురించి వివరించారు. అంతర్గతంగా నిర్మించే 9 నగరాల గురించి కూడా తెలిపారు. ఇక్కడ హైటెక్, ఫ్యాషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టూరిజం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2015లో సీఎం ఆరు రోజుల పాటు చైనాలో పర్యటించి వివిధ అంశాలకు సంబంధించి 29 ఒప్పొందాలు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. సోలార్ విద్యుత్ యూనిట్ స్థాపనకు కూడా ఒక ఒప్పొందం జరిగినట్లు చెప్పారు. ఇప్పటికే చైనాకు చెందిన సంస్థలు పెట్టిన పెట్టుబడుల గురించి తెలిపారు. చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్‌లింగో మాట్లాడుతూ షెన్సాంగ్ సిటీ అభివృద్ధి క్రమం వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాతావరణం తమకు నచ్చినట్లు తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే తమ దేశానికి చెందిన సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. తమ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య బంధం మరింత పటిష్టమవుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.

Related ImagesRelated News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే