Share this on your social network:
Published:
11-05-2017

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్రికి వ‌చ్చే పేద ప్ర‌జ‌ల‌కు వైద్యం అందించ‌డంలో డాక్ట‌ర్లు,సిబ్బంది చిత్త‌శుద్ధితో కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్ పేర్కొన్నారు. గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని సంద‌ర్శించి సూప‌రింటెండెంట్ రాజానాయుడుతో క‌ల‌సి ప్ర‌తి వార్డును త‌నిఖీచేసి అందిస్తున్న వైద్య సేవ‌ల‌పై రోగుల‌ను,డాక్ట‌ర్ల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకోవ‌డం జ‌రిగింది. పార‌శుద్య ఏర్పాట్లు పై క్షుణ్ణంగా ప‌రిశీలించి పారిశుధ్య ఏర్పాట్ల‌పై సంబంధిత ఏజెన్సీపై అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంతోపాటు స‌ద‌రు ఏజెన్సీకి ఈ నెల‌లో చెల్లించే ఫీజులో ల‌క్ష రూపాయ‌లు నిలుపుద‌ల చేయ‌వ‌ల‌సిందిగా సూప‌రింటెండెంట్ రాజానాయుడును ఆదేశించారు. అలాగే వాట‌ర్ లీకేజీ,చిన్న‌చిన్న మ‌ర‌మత్తుల‌ను గుర్తించి,వెంట‌నే మ‌ర‌మ‌త్తుల‌ను చేయించాల్సిందిగా కలెక్ట‌ర్ శ‌శిధ‌ర్ ఎపిఎంఎస్ ఐడిసిఇఇ అశోక్ ను ఆదేశించారు.అనంత‌రం స‌మావేశ మందిరంలో ఆసుప‌త్రి హెచ్ఓడిలు,డాక్ట‌ర్లు,సెక్యూరిటి,శానిటేష‌న్,పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మై రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డంతోపాటు,అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాద‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్ర‌తి నెల అన్ని విభాగాల హెచ్.ఓ.డిలు త‌ప్ప‌ని సరిగా స‌మావేశ‌మై ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌న్నారు.ప్ర‌తి వార్డుకు ఒక డాక్ట‌రును ఇన్ చార్జిగా నియ‌మించి ఆ వార్డు బాధ్య‌త‌ను వారికి అప్ప‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ నుఆదేశించారు. ఆసుప‌త్రిలో రోగుల‌కు సెక్యూరిటి ఏర్పాట్లు ప‌టిష్ఠంగా అమ‌లు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న సి.సి కెమెరాలు స‌రిపోవ‌ని,మ‌రిన్ని సి.సి కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఆసుప‌త్రిలోని ఎక్య‌ప్ మెంట్,ఫ్యాన్లు,ఏ.సీలు స‌క్ర‌మంగా ప‌నిచేస్తున్నది లేనిది సంబంధిత సిబ్బంది నిత్యం త‌నిఖీ చేయ‌డంతో పాటు,ప‌నిచేయ‌ని యెడ‌ల వెంట‌నే మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కలెక్ట‌ర్ సూప‌రింటెండెంట్ ను ఆదేశించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో మెడిక‌ల్ రెప్ర‌జెంటేటివ్ ల‌ను ఆసుప‌త్రి ఆవ‌ర‌ణంలో అనుమ‌తించ‌రాద‌ని సూప‌రింటెండెంట్ ను డాక్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Related ImagesRelated News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే