Share this on your social network:
Published:
08-05-2020

ఒడిశా కూలీల అనుమానాస్పద మృతి

వెల్దుర్తి: మండలంలోని రత్నపల్లె సమీపంలోని రెండు వేర్వేరు ఇటుకల బట్టీలలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వలస కూలీలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, తోటి కూలీల కథనం మేరకు.. నరసింహుడు అనే వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో ఒడిశా రాష్ట్రం బలంగిర్‌ జిల్లాకు చెందిన నీలో మాఝి(40) ఒంటరిగా వచ్చి ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు. ఇతను అక్కడే చిన్నపాటి గదిలో ఉండేవాడు. సోమవారం రాత్రి పడుకున్న ఇతన్ని మంగళవారం తెల్లవారు జామున నిద్ర లేపేందుకు తోటి కూలీలు వెళ్లగా విగతజీవిగా కనిపించాడు. అలాగే ఆ బట్టీకి అర కి.మీ దూరంలోని రమేశ్‌ అనే వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాకు చెందిన తారాచంద్‌ మాఝి (36) పనిచేస్తున్నాడు. ఇతను ఇద్దరు కుమార్తెలను స్వగ్రామంలోనే ఉంచి, భార్య కపూరితో కలిసి ఐదు నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. తోటి కూలీలతో కలిసి సోమవారం రాత్రి నిద్రించిన ఇతను విగతజీవిగా మారడాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు. చెవిలో రక్తం వచ్చింది. విషయం తెలుసుకున్న డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, రూరల్‌ సీఐ సుధాకర్‌ రెడ్డి, వెల్దుర్తి ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రెడ్డి సంఘటన స్థలాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. డోన్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు వచ్చి వివరాలు సేకరించారు. రెండు ఇటుకల బట్టీలలో ఒకే రాష్ట్ర వాసులు ఒకేరోజు, ఒకే విధంగా మృతిచెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related Images



Related News


బాబు దుర్మార్గ వైఖరే కోడెల ఆత్మహత్యకు కారణం: అంబటి

కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైఎస్సార్‌సీపీ మీదకు న


అల్ప పీడనం.. మత్సకారులకు హెచ్చరిక

దక్షిణ అండమాన్‌ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆం


ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్లు: ఆళ్ల నాని

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్ల


లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైంది: పవన్‌కల్యాణ్

లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆందోళన


ఒడిశా కూలీల అనుమానాస్పద మృతి

వెల్దుర్తి: మండలంలోని రత్నపల్లె సమీపంలోని రెండు వేర్వేరు ఇటుకల బట్టీ


గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్ర


మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకి అనుమతి

మంగళగిరి ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్


అష్ట దిగ్బంధంలో నరసరావుపేట

గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చ


పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలు:

పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశా


మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం

మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 3


ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు

ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు రాష్ట్రంలో వివిధ ప్రాంత


వైసీపీ కార్యకర్తకు కత్తి పోట్లు : దుండగులు కోసం అన్వేషణ లో పోలీసులు:

: పొన్నూరు : స్థానిక నిడుబ్రోలు కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కా


పొన్నూరు లో బీజేపీ - జనసేనపార్టీల సంయుక్త నిరసన:

( విన్యూస్ , పొన్నూరు ) : అంతర్వేది రధం దగ్ధం వరుసగా హిందూ దేవాలయాల పై దాడ


ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టిన జనసేన వీర మహిళ

:( విన్యూస్ , పొన్నూరు ) :జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్   పిలుపు మేరకు జనస


ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు

:( విన్యూస్ , పొన్నూరు ) : పొన్నూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలను గురువారం


కూరగాయల ధరలు నియంత్రణ లో అధికారులు విఫలం.

తెనాలి సెప్టెంబర్10 విన్యూస్ రోజు రోజు కు పెరుగుతున్న కూరగాయల ధరలు, అరి