Share this on your social network:
Published:
31-03-2017

బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ్రీ చదివితే నేరుగా ఉద్యోగాలు రావు. వివిధ ఉద్యోగాలకు అది కేవలం అర్హత మాత్రమే. డిగ్రీ తదుపరి పిజి, పిహెచ్‌డి చేస్తేనే ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది నిరుత్సాహ పరిచేవారు కూడా. పేదవాళ్ళు మాత్రమే. డిగ్రీ అది కూడా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతారని అనుకునేవారు. తెలుగు విద్యార్థుల్లో చాలామంది ఇంటర్‌లో ఎంపిసి, బైపిసి, ఎంఈసి చదువుతారు. వీరిలో ఎంపిసి చదివే వారి సంఖ్య ఎక్కువ. మళ్లీవారిలో అధికులు ఇంజినీరింగ్‌ వైపు వెళ్ళేవారే ప్రస్తుతం మారిన పరిణామాల్లో ఇంజినీరింగ్‌ చదివిన వారందరికీ మంచి ఉద్యోగాలు రావడంలేదు. అలాగే బైపిసి చదివే విద్యార్థులు కూడా చాలామంది డిగ్రీ చదువుతున్నారు. ప్రత్యేకించి గడచిన మూడేళ్ళలో డిగ్రీ చదివే విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. పరిస్థితుల్లో మార్పు : కార్పొరేట్‌ కంపెనీల్లో అలాగే ఎమెన్సీల (మల్టీ నేషనల్‌ కంపెనీస్‌) ఉద్యోగుల ఎంపిక ధోరణిలో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. డిగ్రీ చదువుతోనే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు రావడం మొదలైంది. చాలా కంపెనీలు డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడమే కాదు, ఒక మోస్తరు వేతనానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ పాసైనవారితో పోలిస్తే డిగ్రీ విద్యార్థుల్లో ఓర్పు, సహనం, కొత్త విషయాలపై ఆసక్తి కనిపిస్తున్నాయి. ఎటువంటి భేషజాలకు పోకుండా సంస్థ కోసం నిబద్ధతగా కష్టపడతారన్న అభిప్రాయం ఏర్పడింది. బిటెక్‌ పూర్తయ్యేసరికి పదహారేళ్ళ చదువు పూర్తవుతుంది. దాంతో విదేశాల్లో చదువు సహా వివిధ అవకాశాలు వారిని ఊరిస్తున్నాయి. ఆ వెసులుబాటు మూడేళ్ళ డిగ్రీ చేసిన వారికి ఉండటం లేదు. ఫలితంగా వారు తమను తీసుకున్న కంపెనీల్లో కొంత కాలం నిలకడగా పనిచేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా పని చేసే కంపెనీలకు ఈ పరిణామం సౌకర్యంగా ఉంది. అందువల్ల చాలా కంపెనీలు ఉద్యోగ కల్పనలో ఇగ్రీ విద్యార్థులకు ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఆదిలో పేర్కొన్నట్టు ఎటువంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నా డిగ్రీ తప్పనిసరి. అది కూడా నేటి యువత డిగ్రీ కోర్సుల్లో చేరడానికి కారణమవుతోంది. ఇటీవలి రోజుల్లో ఎక్కువ శాతం విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సులను వదిలిపెట్టి ఇంజినీరింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో లెక్చరర్ల కొరత ఏర్పడిది. బిఎ, బికాం, బిఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీల తరవాత ఎమ్మె, ఎంకాం, ఎమ్మెస్సీ వంటివి చేసి అధ్యాపక వృత్తిని చేపట్టవచ్చు అలాంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అటు సమాజానికీ ఎంత గానో ప్రయోజనకరం. డిగ్రీ కోర్సుల్లో ఒత్తిడి, తక్కువగా ఉంటుంది. డిగ్రీ చూస్తూనే ఏదో ఒక పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసుకున్నట్లయితే చదువుతో పాటు సంపాదనకూ అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కామర్స్‌ విద్యార్థులు ఏదో ఒక అడిట్‌ సంస్థలో లేదంటే అకౌంటింగ్‌ శాఖలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసినట్లయితే ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని పెంపొంఇంచుకోవచ్చు. డిగ్రీ కోర్సుల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. డిగ్రీ చేస్తూనే ఏదో ఒక పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసుకున్నట్లయితే చదువుతో పాటు సంపాదనకూ అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కామర్స్‌ విద్యార్థులు ఏదో ఒక అడిట్‌ సంస్థలో లేదంటే అకౌంటింగ్‌ శాఖలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసినట్లయితే ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని పెంపొందుచుకోవచ్చు. డిగ్రీ రెండో సంవత్సరం నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధమయితే మంచిది. తద్వారా తృతీయ సంవత్సరం ముగియగానే ఎలాంటి పోటీ పరీక్షనైనా రాయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. డిగ్రీ చదువుల్లో బికాం కోర్సుకు ప్రత్యేకత ఉంది. ఒక సంస్థలో మేనేజర్‌ నుంచి క్లర్క్‌ స్థాయి వరకు వివిధ స్థాయుల్లో అంటే అడిట్‌, మానవ వనరులు, పేరోల్‌ తయారీ, మార్కెటింగ్‌, ఫైనాన్షియల్‌ అకౌంట్స్‌ వరకు వివిధ విభాగాల్లో ఇస్తృత అవకాశాలు ఉంటాయి. ప్రతి సంస్థలోనూ కొద్దిపాటి మార్పులతో ఈ విభాగాలన్నీ ఉంటాయి. గతంలో లేని విధంగా ప్రభుత్వాలు కూడా డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Related ImagesRelated News


స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచ


ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంల


శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖా


బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ


1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో


మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌


చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువె