Share this on your social network:
Published:
15-03-2017

శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కె.కృష్ణ‌కుమారి తెలిపారు. సోష‌ల్ వ‌ర్క్‌లో డిగ్రీ/పీజీ, సైకాల‌జీ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్‌, డ‌వ‌ల‌ప్‌మెంట్‌లో పీజీ డిప్ల‌మా చేసి క‌నీసం 2 సంవ‌త్స‌రాల అనుభవం క‌లిగిన మ‌హిళ‌లు , 45 సంవ‌త్స‌రాల‌లోపు వ‌య‌స్సు ఉన్న‌వారు సోష‌ల్ వ‌ర్క‌ర్ ఉద్యోగానికి అర్హుల‌ని చెప్పారు. ఎంబిబీఎస్ చ‌దివి పీడియాట్రిక్ మెడిసిన్‌లో స్పెష‌లైజేష‌న్ చేసిన అభ్య‌ర్థులు డాక్ట‌ర్ పోస్టుకు , ఆరోగ్యం క‌లిగి ఎటువంటి చెడు అల‌వాట్లు లేని అన‌గా గుట్కా,సిగ‌రెట్, పాన్ , మ‌ధ్య‌పానం అల‌వాట్లు లేని వారు చౌకీదారు ఉద్యోగానికి, 6ఏళ్ల‌లోపు చిన్న‌పిల్ల‌ల‌ను పెంచ‌గ‌ల్గి , పిల్ల‌ల‌ను ఆద‌రాభిమానాల‌తో చూడ‌గ‌ల్గిన మ‌హిళా అభ్య‌ర్థులు ఆయా పోస్టుకు అర్హుల‌ని వివ‌రించారు. ధ‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 21వ తేదీలోపు ప్రాజెక్టు డైరెక్ట‌ర్ , జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ,స్వేచ్చా ప్లాజా , బెంజిస‌ర్కిల్, విజ‌య‌వాడ‌లో అంద‌చేయాల‌ని చెప్పారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 0866-2493197నంబ‌రులో సంప్ర‌దించ‌వ‌చ్చున‌న్నారు.

Related Images



Related News


స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచ


ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంల


శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖా


బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ


1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో


మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌


చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువె