Share this on your social network:
Published:
07-03-2017

స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచి రెండు కొత్త కోర్సులకు సంబంధించి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక్కడి స్వశక్తి భవనంలో ఆంధ్రాబ్యాంకు, జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. తాజాగా మహిళల కోసం హోమ్‌ నర్సింగ్‌, శారీ స్క్రీన్‌ పెయింటింగ్‌లో కొత్త బృందాలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు వయసు ఉండి, ఎనిమిదో తరగతి కనీస విద్యార్హత ఉన్న మహిళలు దీనికి అర్హులు. శారీ పెయింటింగ్‌లో 20 రోజులు, హోమ్‌ నర్సింగ్‌లో 45 రోజులపాటు సమగ్ర శిక్షణ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్వశక్తి కేంద్రం డైరెక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. శిక్షణార్థులకు ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేస్తారు. హోమ్‌ నర్సింగ్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు శివకుమార్‌ వివరించారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు : 08676-259665, 94409 15708, 94407 72382.

Related Images



Related News


స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచ


ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంల


శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖా


బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ


1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో


మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌


చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువె