Share this on your social network:
Published:
23-04-2017

ఉత్సాహంగా కృష్ణా యూనివ‌ర్శిటీ స్నాత‌కోత్స‌వం

మ‌చిలీప‌ట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శ‌నివారం ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో జ‌రిగింది. విశ్వవిద్యాలయ కులపతి నరసింహన్‌, ఉపకులపతి రామకృష్ణారావు, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ వంటి ప్రముఖులు హాజరైన స్నాతకోత్సవం చారిత్రక బందరు ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేందుకు వేదికగా నిలిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్ర జాతీయ కళాశాల వైభవాన్ని ప్రస్తుత విద్యార్థులకు తెలియజేసింది. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ మచిలీపట్నం గురించి మాట్లాడుతూ భారతదేశంలో పేరెన్నికగన్న కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు వంటి ప్రముఖులు ఆంధ్ర జాతీయ కళాశాలను స్థాపించి స్వాతంత్య్రోద్యమానికి వూపిరిలూదిన పుణ్యధరిత్రి బందరు అని పేర్కొన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాల బాపూజీ పాద ధూళితో పునీతమైందంటూ శ్లాఘించారు. పలువురు రచయితలు, కవులకు పురిటిగడ్డగా వెలుగొందిన సాంస్కృతిక ఘనత బందరు చరిత అంటూ ప్రస్తుతించారు. అటువంటి చారిత్రక ప్రాశస్త్యమున్న మచిలీపట్నానికి తాను రెండోసారి విచ్చేయడం తనకెంతో సంతోషదాయమని వ్యాఖ్యానించారు. గౌరవ డాక్టరేట్‌ గ్రహీత అయిన మండలి బుద్ధప్రసాద్‌ సైతం తన ప్రసంగంలో మచిలీపట్నానికి పెద్దపీట వేశారు. 1907లో బందరులో స్థాపించిన ఆంధ్రజాతీయ కళాశాల దేశంలోనే రెండోదిగా నిలవడం బందరు చరిత్రకు తలమానికమన్నారు. స్వాతంత్య్రోద్యమానికి కేంద్ర బిందువుగా ఉండగలిగిన శక్తి ఆంధ్ర జాతీయ కళాశాలకు ఉందని మహాత్ముడు వ్యాఖ్యానించడం కళాశాల వైభవానికి తార్కాణమన్నారు. దేశంలోకెల్లా మొట్టమొదటి ఆంగ్ల కళాశాల మచిలీపట్నంలోనే ఏర్పడిందన్నారు.

Related Images



Related News


కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు

కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థుల


నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్‌ పాలసీ, అంబేడ్కర్‌ ఐడియాలజీ సదస్సు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బ్రాహ్మణ వ్యతిరేకి


కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివ‌ర్శిటీలో సమీక్ష

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్‌ సెనెట్‌ కమిటీ


కృష్ణా వ‌ర్శిటీలో 2017 పిజి సెట్‌ అడ్మిషన్లకు.. పోస్ట‌ర్ ఆవిష్కరణ

2017 పిజి సెట్‌ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా ల


ఘ‌నంగా ఎస్‌.ఆర్‌.కె. ఇంజినీరింగ్ క‌ళాశాల వార్షికోత్స‌వం

విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన


ఇగ్నోలో తెలుగు మాధ్య‌మంలో కొత్త కోర్సులు

ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగ


ఉత్సాహంగా కృష్ణా యూనివ‌ర్శిటీ స్నాత‌కోత్స‌వం

మ‌చిలీప‌ట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శ‌నివారం ఆహ్లాద