ఘనంగా ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం
విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఎనికేపాడులోని ఎస్‌ఆర్‌కె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కూడా తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయి కోర్సులు అభ్యసించడంతోపాటు తోటి వారు చదువుకోడానికి తగిన విధంగా సహకారం అందించాలన్నారు. అలాగే చదువుకున్న విద్యా సంస్థను, గురువును ఎప్పటికీ మరచిపోకూడదని తెలిపారు. మనకు మార్గదర్శకులు గురువులేనని, వారిని ఆదరించాలని పేర్కొన్నారు. కళాశాల ఛైర్మన్ బోయపాటి అప్పారావు మాట్లాడుతూ 2007లో కళాశాలను స్థాపించి కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విద్యను అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఉపాధి నైపుణ్యాల పట్ల ప్రఖ్యాత కంపెనీల సర్టిఫికెషన్‌తో కూడిన శిక్షణను నాణ్యతతో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్నామని పేర్కొన్నారు. పదో వార్షికోత్సవ వేడుకలను పురష్కరించుకుని ఈ ఏడాది నుండి ఎస్‌ఆర్‌కె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో యూఎస్‌కు చెందిన ప్రఖ్యాత ఐవోటి దిగ్గజ సంస్థలైన ఆక్సెల్టా, థింగ్ రోక్స్‌ల సమన్వయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నందు, జపాన్‌కు చెందిన యాక్సిస్ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండిస్టియల్ ట్రైనింగ్ వారి అనుసంథానంతో ఇండిస్టియల్ ఆటోమేషన్, రోబోటిక్స్‌పై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అలాగే డిజిటల్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌పై యూఎస్‌కు చెందిన ఇసి కౌన్సిల్ వారి అనుభవంతో, కేంబ్రిడ్జి యూనివర్శిటీ, యూకె వారి అనుసంధానంతో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌పై శిక్షణా కేంద్రాలను అందిస్తున్నామని తెలిపారు. కళాశాల సెక్రటరీ బోయపాటి శ్రీకృష్ణ మాట్లాడుతూ రానున్న సంవత్సరాలలో నూతన సాంకేతికతలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.వో.టి.) సైబర్ సెక్యూరిటీ, ఇండిస్టియల్ ఆటోమేషన్ వంటి రంగాలలో ఎన్నో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ ఎం.సి.దాస్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎకాంబరం కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Related Images
Related News
కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు
కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థుల
నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్ పాలసీ, అంబేడ్కర్ ఐడియాలజీ సదస్సు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణ వ్యతిరేకి
కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివర్శిటీలో సమీక్ష
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్ సెనెట్ కమిటీ
కృష్ణా వర్శిటీలో 2017 పిజి సెట్ అడ్మిషన్లకు.. పోస్టర్ ఆవిష్కరణ
2017 పిజి సెట్ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా ల
ఘనంగా ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం
విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన
ఇగ్నోలో తెలుగు మాధ్యమంలో కొత్త కోర్సులు
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగ
ఉత్సాహంగా కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవం
మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శనివారం ఆహ్లాద