నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్ పాలసీ, అంబేడ్కర్ ఐడియాలజీ సదస్సు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణ వ్యతిరేకి కాదని...కేవలం వారు అనుసరిస్తున్న విధానాలను మాత్రమే తప్పుపట్టారని అంబేడ్కర్ సోషల్, సైన్స్ విశ్వవిద్యాలయం (ఇండోర్) ఆచార్యుడు డీకే వర్మ అభిప్రాయపడ్డారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో సోషల్ పాలసీ, అంబేడ్కర్ ఐడియాలజీ పేరుతో బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆచార్య డీకే వర్మ, ఏఎన్‌యూ ఉపకులపతి ఆచార్య రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సామాజిక న్యాయం ఇంకా అందని ద్రాక్షగా మారిందని వర్మ అభిప్రాయపడ్డారు. సోషల్ పాలసీలను రాజకీయ నేతలు కాకుండా విద్యావంతులు రూపొందించి ఉంటే అది విజయవంతమై ఉండేదన్నారు. రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నదీజలాల వివాదానికి అంబేడ్కర్ ఎప్పుడో పరిష్కారం సూచించారన్నారు. రైళ్లను జాతీయం చేసినట్లే నదులనూ జాతీయం చేసినట్లైతే వివాదాలుండవని సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. ఏఎన్‌యూ ఉపకులపతి ఆచార్య రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే సోషల్ పాలసీలే శరణ్యమన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళితులు అభివృద్ధి చెందుతారని అంబేడ్కర్ పరిశోధన కేంద్రం మాజీ సంచాలకులు ఆచార్య శ్యామ్యూల్ పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కరిజంపై రూపొందించిన వెబ్‌సైట్, పరిశోధన పత్రాల పుస్తకాన్ని వర్మ, రాజేంద్రప్రసాద్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ పరిశోధన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మురళీమోహన్, ఆచార్య స్వరూపారాణి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ అశోక్, డాక్టర్ త్రిమూర్తి పాల్గొన్నారు.
Related Images
Related News
కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు
కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థుల
నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్ పాలసీ, అంబేడ్కర్ ఐడియాలజీ సదస్సు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణ వ్యతిరేకి
కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివర్శిటీలో సమీక్ష
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్ సెనెట్ కమిటీ
కృష్ణా వర్శిటీలో 2017 పిజి సెట్ అడ్మిషన్లకు.. పోస్టర్ ఆవిష్కరణ
2017 పిజి సెట్ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా ల
ఘనంగా ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం
విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన
ఇగ్నోలో తెలుగు మాధ్యమంలో కొత్త కోర్సులు
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగ
ఉత్సాహంగా కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవం
మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శనివారం ఆహ్లాద