కృష్ణా వర్శిటీలో 2017 పిజి సెట్ అడ్మిషన్లకు.. పోస్టర్ ఆవిష్కరణ
2017 పిజి సెట్ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా లయం వైస్‌ఛాన్స్‌లర్ ఎస్.రామకృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు. కృష్ణా యూనివర్శిటీ క్యాంపస్ కళాశాల, డాక్టర్ ఎం.ఆర్.అప్పారావు పిజి సెంటర్ నూజివీడు, కృష్ణా విశ్వవిద్యా లయం అనుబంధ కళాశాలల పిజి అడ్మిషన్లకు సంబంధించిన కెఆర్‌యు సెట్-2017 నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో వారి వివరాలను నమోదు చేసుకొని పరీక్షకు సిద్ధం కావాలని కోరారు. రిజిస్ట్రార్ డి.సూర్య చంద్రరావు మాట్లాడుతూ రానున్న విద్యాసంవత్సరం నుండి కృష్ణా విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాల మచిలీపట్నంలో చేరబోయే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నామని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యా లయం అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ రామశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల బయోటెక్నాలజీ విభాగంలో ఫీజును భారీగా తగ్గించామని తెలిపారు. ఈ అవకాశాన్ని సైన్స్ విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ ప్రవేశపరీక్ష ద్వారా అర్హత సాధించి సీటు పొందిన విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ వై.కె.సుందరకృష్ణ, అడ్మిషన్ డైరెక్టర్స్ భవాని, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Related Images
Related News
కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు
కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థుల
నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్ పాలసీ, అంబేడ్కర్ ఐడియాలజీ సదస్సు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణ వ్యతిరేకి
కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివర్శిటీలో సమీక్ష
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్ సెనెట్ కమిటీ
కృష్ణా వర్శిటీలో 2017 పిజి సెట్ అడ్మిషన్లకు.. పోస్టర్ ఆవిష్కరణ
2017 పిజి సెట్ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా ల
ఘనంగా ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం
విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన
ఇగ్నోలో తెలుగు మాధ్యమంలో కొత్త కోర్సులు
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగ
ఉత్సాహంగా కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవం
మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శనివారం ఆహ్లాద