కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు
కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానుంది. 2017-18 విద్యాసంవత్సరంలో పీజీ డిప్లమో ఇన్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లమో ఇన్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడాది కాల పరిమితి ఉన్న ఈ కోర్సుల్లో ఇంటర్ సైన్సు చదివిన (ఎంపీసీ, బైపీసీ) అభ్యర్థులు అర్హులు. ఏడాది కాలంలో 9 నెలలు తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన, మూడు నెలల కాలం ప్రయోగ, క్షేత్ర పద్ధతిలో బోధన ఉంటుంది. ఇప్పటికే 12 పీజీ కోర్సులు, కూచిపూడికి సంబంధించిన పీజీ డిప్లమో (సూత్రధార), డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులకు త్వరలో కేఆర్‌యూ సెట్-2017 ప్రకటన విడుదల కానుంది. సెట్ కన్వీనర్‌గా వర్సిటీ రసాయనశాస్త్ర విభాగాధిపతి డి.రామశేఖర రెడ్డిని, సహాయ కన్వీనర్లుగా ఆంగ్ల విభాగానికి చెందిన ఆచార్యులు ఎం.కోటేశ్వరరావు, ఇ.భవానీలకు బాధ్యతలు అప్పగించారు. మచిలీపట్నం మురుగు పారుదల వ్యవస్థను స్వయంగా చూసిన ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు వృథా నీటి నిర్వహణ కోర్సుకు రూపకల్పన చేశారు. ఉదయం నడకలో అక్కడి మురుగు పారుదల వ్యవస్థను చూసి అమెరికాలో చికాగో మెట్రోపాలిటన్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. జిల్లాలో ఆక్వాకల్చర్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని అందులో పీజీ డిప్లమో కోర్సుకు రూపకల్పన చేశారు.
Related Images
Related News
కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు
కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థుల
నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్ పాలసీ, అంబేడ్కర్ ఐడియాలజీ సదస్సు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణ వ్యతిరేకి
కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివర్శిటీలో సమీక్ష
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్ సెనెట్ కమిటీ
కృష్ణా వర్శిటీలో 2017 పిజి సెట్ అడ్మిషన్లకు.. పోస్టర్ ఆవిష్కరణ
2017 పిజి సెట్ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా ల
ఘనంగా ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం
విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన
ఇగ్నోలో తెలుగు మాధ్యమంలో కొత్త కోర్సులు
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగ
ఉత్సాహంగా కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవం
మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శనివారం ఆహ్లాద