Share this on your social network:
Published:
11-04-2017

అర్చ‌కుల‌కు తితిదే ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ‌

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆలయాల పురోగతిపై ధర్మపరిరక్షణ ట్రస్ట్‌, సమరసతా సేవా ఫౌండేషన్‌ సంయుక్తంగా సోమవారం సమీక్షించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలోని దేవాలయ పాలనా సంస్థ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి సమరసతా సేవా ఫౌండేషన్‌ అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మూర్తి అధ్యక్షత వహించారు. హిందూ ధర్మపరిరక్షణట్రస్ట్‌ అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్‌ నేతృత్వంలో సమీక్షించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 500 ఆలయాలు రూపురేఖలు ఎలా ఉండాలనే అంశంపైనా చర్చించారు. తొలి విడత 72 మంది అర్చకులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్కడ దేవాలయ నిర్మిస్తున్నారో ఆ ప్రాంతానికి చెందిన వారిని అర్చకులుగా ఎంపిక చేయాలని భావించారు. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శిక్షణ ఇస్తే బాగుంటుందని సమావేశం అభిప్రాయపడింది. ఈనెల 25వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాలని సంకల్పించారు. నూతనంగా ప్రారంభించబోయే ఆలయాల్లో 72 దేవతామూర్తుల విగ్రహాలు అవసరమని భావిస్తున్నారు. మహిళలను కూడా ధర్మప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సమావేశం నిర్ణయించింది. ధర్మప్రచారానికి ఉపయోగించే రథాలకు టోల్‌టాక్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ డైరెక్టర్‌ విజయరాఘవాచార్యులు, విశ్రాంత చీఫ్‌ ఇంజినీరు కొండలరావు, దేవాదాయశాఖ పర్యవేక్షక ఇంజినీరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related ImagesRelated News


క‌న‌క‌దుర్గ గుడిలో దాత‌ల‌కోసం ప్ర‌త్యేక రాయితీలు

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై రూ.52 కోట్లతో చేపట్టిన సమగ్రాభివృద్ధి ప్రణ


ఇంద్ర‌కీలాద్రిపై అష్ట‌ల‌క్ష్ముల ముందు నక్షత్ర తాబేలు ప్ర‌త్య‌క్షం

ఇంద్రకీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మిల ముందు అర


నెమ‌లిలో వైభ‌వంగా వేణుగోపాలుని ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

స్వయంభూగా వెలసిన నెమలి వేణుగోపాలస్వామి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవా


గుంటూరు శ్రీ మ‌హాల‌క్ష్మీ యాగంలో ల‌క్ష తుల‌సి పూజ‌

శ్రీమహాలక్ష్మీయాగం కార్యక్రమంలో భాగంగా లక్ష్య సిద్ధి కోసం అనంత శ్రీ


దుర్గ‌గుడి ఘాట్ రోడ్డు అభివృద్ధి ప‌నుల‌కు రూ.3కోట్లు కేటాయింపు

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఘాట్‌ రోడ్డు అభివృద్ధికి దేవస


అర్చ‌కుల‌కు తితిదే ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ‌

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆలయాల పురో


తిరుమ‌ల‌గిరిలో ఘ‌నంగా వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వాలు

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌గిరిలో వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యా


అత్యంత ఘ‌నంగా తిరుమ‌ల‌గిరి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వం

పండు వెన్నెలలో అత్యంత కమనీయంగా సాగిన తిరుమలేశుని కల్యాణం కనుల పండువ చ


"దుర్గగుడిలో నారాయణ తీర్ధతరంగ గాన శిక్షణ ప్రారంభం"

కృష్ణం కలయసఖీ సుందరం బాలకృష్ణమ్ కలయసఖీసుందరమ్, జయజయ దుర్గే జితవైరి దు


ప‌వ‌ళింపుసేవ తో క‌ళ్యాణోత్స‌వాలు ముగింపు

పశ్చిమ కృష్ణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరిలోని వేంకటేశ్వర స్


ఏప్రిల్ 21 నుంచి ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ‌కు నిత్య స్వ‌ర్ణ పుష్పార్చ‌న‌

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ నెల 21 నుంచి న


అక్షయ తృతియ నాడు దుర్గగుడిలో శ్రీమహాలక్ష్మీయాగం

సిరులనొసగే శ్రీమహాలక్ష్మీయాగం ను 29వ తేదీ అక్షయ తృతియ సందర్భముగా అమ్మవ


దుర్గ‌మ్మ భ‌క్తుల‌కు దివ్య ర‌థాలు

తిరుమల తరహాలో భక్తులు దూరం నుంచి చూడగానే దుర్గామల్లేశ్వర స్వామి వార్


ఇంద్ర‌కీలాద్రిపై ఘ‌నంగా శ్రీ‌మ‌హాల‌క్ష్మీ యాగం

అత్యంత ప‌విత్ర మాస‌మైన‌ వైశాఖ మాసంలో వచ్చే అక్షయతృతీయ చాలా విశేషమైంద


ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా జ‌గ‌ద్గురు ఆదిశంక‌రాచార్యుల జ‌యంతి వేడుక‌లు

వైశాక‌శుద్ధ పంచ‌మి రోజున శ్రీ ఆదిశంక‌రాచార్యుల వారు జ‌న్మించిన ప‌ర‌మ


గుంటూరు బృందావ‌న్‌గార్డెన్స్ వెంక‌టేశ్వ‌రునికి స్వ‌ర్ణ వ‌క్ష‌స్థ‌ల ఆభ‌ర‌ణం

గుంటూరులోని బృందావన గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఆదివా


అమ్మ‌వారి ఆల‌యంలో నూత‌న ఆర్జిత సేవ‌గా వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి శాంతి క‌ళ్యాణం

ఇంద్ర‌కీలాద్రిపై ఉపాల‌య‌మునందు వేంచేసియున్న వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సు


మంగ‌ళ‌గిరిలో నృసింహ జ‌యంతి ఉత్సవాలు ప్రారంభం

మంగళగిరి శ్రీపానకాల శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్


దుర్గ‌గుడిలో ప్ర‌తి పౌర్ణ‌మికి భ‌క్తుల‌తో ఉచిత కుంకుమార్చ‌న పూజ‌

దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్మామివార్ల దేవ‌స్థానంలో ప్ర‌తినెల వ‌చ్చే పౌర్ణ‌


ఆదివారం ఇంద్ర‌కీలాద్రిపై స‌రస్వ‌తి యాగం నిర్వ‌హ‌ణ‌

వైశాఖ‌మాస మూలా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా దేవస్థాన యాగ‌శాల‌లో స‌ర‌స్వ‌తి