Share this on your social network:
Published:
01-05-2017

సెక్ర‌టేరియ‌ట్‌లో ఉద్యోగుల పిల్ల‌ల‌కు ప్ర‌త్యేకంగా బేబీకేర్ సెంట‌ర్ ఏర్పాటు

సచివాలయ ఉద్యోగులతో పాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అందుకోసమే సచివాలయంలో ప్రత్యేకంగా బేబీ కేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయంలోని ముడో బ్లాక్‌లో నిర్వహిస్తున్న బేబీ కేర్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. అనంతరం మంత్రి ప‌రిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ సచివాలయంలో నిర్వహిస్తున్న బేబీ కేర్ సెంటర్‌లో 13 మంది వరకూ చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. చిన్నారుల బాగోగులను చూసుకోడానికి ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇద్దరు ఆయాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఉద్యోగులు విధి నిర్వహణకు ఆటంకం కలుగకుండా ఉండడంతో పాటు చిన్నారుల సంక్షేమానికి బేబీ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులు, వారి పిల్లల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. పిల్లల ఉల్లాసానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశామన్నారు. బేబీ కేర్ సెంటర్లో కొన్ని సమస్యలున్నట్లు సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సునీత తెలిపారు.స‌చివాల‌యంలో కేర్ సెంటర్‌ను మోడల్ సెంటర్‌గా ఏర్పాటు చేశామని స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అపర్ణ తెలిపారు. ఇటువంటి సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. ఆ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ర్టంలో మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా అత్యుత్తమ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

Related Images



Related News


గుంటూరులో మ‌హాన‌టి సావిత్రి కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణః పాల్గొన్న సుహాసిని

కళాదర్బార్‌ అమరావతి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నాజ్‌కూడలిలో మహ


స్వయం ఉపాధికి వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ

స్వయం ఉపాధికి దోహదపడే వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్ష


మ‌హిళ‌ల కోసం కొన్ని ప్ర‌త్యేక తీర్మానాలుః న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యములో సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు చైర్ ప‌ర్స‌న


ప్ర‌తి మ‌హిళ నెల‌కు రూ.10 వేలు సంపాదించేలా అవ‌కాశాలు క‌ల్పిస్తాంః స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పర

ప్రతి మహిళకు నెలకు రూ.10 వేలు ఆదాయం వచ్చేలా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిం


టీ.వీ సీరియ‌ల్స్ కు సెన్సార్ బోర్డు అవ‌స‌రంః న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

కొన్ని టీ.వి సీరియ‌ల్స్ లో మ‌హిళ పాత్ర‌ల‌ను భ‌యంక‌ర విల‌న్స్ గా చిత్రీ


సెక్ర‌టేరియ‌ట్‌లో ఉద్యోగుల పిల్ల‌ల‌కు ప్ర‌త్యేకంగా బేబీకేర్ సెంట‌ర్ ఏర్పాటు

సచివాలయ ఉద్యోగులతో పాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రా


డ్వాక్రా మ‌హిళ‌లు నెల‌కు 10 వేలు సంపాదించుకునేలా ప్ర‌ణాళిక‌లుః మంత్రి ప‌రిటాల సునీత‌

రాష్ట్రంలో ఉన్న స్వ‌యం స‌హాయ‌క సంఘంలోనే ప్ర‌తి స‌భ్యురాలికి నెల‌కు 10వ


మాంటిస్సోరి విద్యాసంస్థ‌ల అధినేత కోటేశ్వ‌ర‌మ్మ‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం

శనివారం విజయవాడ లబ్బీపేటలోని మాంటిస్సోరి కళాశాల ప్రాంగణంలో విద్యాసం