Share this on your social network:
Published:
24-03-2017

కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివ‌ర్శిటీలో సమీక్ష

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్‌ సెనెట్‌ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన సాగిన సమావేశానికి సమావేశమైన సెనెట్‌కు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య విజయరాజు, ఏఎన్‌యూ మాజీ వీసీలు రామకోటయ్య, సింహాద్రి, రాఘవులు, బాలమోహన్‌దాస్‌, హరగోపాల్‌, వియన్నారావు, కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సూర్యచంద్రరావు హాజరయ్యారు. నూతన కోర్సులు, ఇతర అంశాలపై కమిటీ విపులంగా చర్చించింది. కంప్యూటర్‌ సైన్‌ విభాగాన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలో విలీనం చేయాలంటూ వెంకట్రావు కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. ఆ విభాగంలో అంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారున్నారని, అందుకే కలపాలని నిర్ణయించారని ఓ అధ్యాపకుడు సెనెట్‌ దృష్టికి తీసుకుకొచ్చారు. ఆచార్య సింహాద్రి స్పందిస్తూ కులాల ప్రస్తావన తీసుకురావద్దన్నారు. అధ్యాపకులు డిప్యూటేషన్‌పై ఇంజినీరింగ్‌ కళాశాలలో పాఠాలు బోధించవచ్చని సూచించారు. పరిశోధనలలో తీసుకొచ్చిన నూతన విధానాలనూ కమిటీ తోసిపుచ్చింది. యూజీసీ విధానాలకు అనుగుణంగా లేవని..మళ్లీ కమిటీ వేయాలని పేర్కొంది. యూజీసీలో బీఏ అరబిక్‌, బీఏ చైనీస్‌ కోర్సులకు సెనెట్‌ ఆమోదం తెలిపింది. గతంలో మార్పులు చేసిన ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ కోర్సును ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ నానో టెక్నాలజీగా మార్చడానికి సమ్మతం తెలిపింది. ఏడాది వ్యవధి పీజీ డిప్లొమా కోర్సులు, మార్కుల లిస్టులపై విద్యార్థి ఫొటో, ఆధార్‌ నెంబరు ఉండాలనే యూజీసీ నిబంధనల అమలుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సెల్ఫ్‌ పైనాన్స్‌ కోర్సుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు నియమించిన హైపవర్‌ కమిటీ నిర్ణయాలకు సెనెట్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏఎన్‌యూలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా వూపింది. మొదటి విడతలో 97, రెండో విడతలో13 అసిస్టెంట్‌, అసోసియేటెడ్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. సమావేశంలో రూ.412.80 కోట్లతో రూపొందించిన 2017-18 వార్షిక బడ్జెట్‌ను సీడీసీ డీన్‌ కోటేశ్వరరావు ప్రవేశపెట్టారు. 2016-17లో ప్రభుత్వం నుంచి రూ.58 కోట్లు వచ్చాయని, ఈ సారి 126.10 కోట్లు అడిగామని వివరించారు. 40వ వార్షిక నివేదికను ఆచార్య రత్నషీలామణి ప్రవేశపెట్టగా సెనెట్‌ ఆమోదముద్ర వేసింది. న్యాక్‌ గుర్తింపు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ ఉపకులపతులను వీసీ రాజేంద్రప్రసాద్‌ సత్కరించారు. ఏఎన్‌యూ రెక్టార్‌ సాంబశివరావు, రిజిస్ట్రార్‌ జాన్‌పాల్‌, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విక్టర్‌బాబు, దూరవిద్యాకేంద్రం సంచాలకులు శంకర పిచ్చయ్య, ఆచార్య వెంకట్రావు, డీన్‌ సిద్ధయ్య పాల్గొన్నారు.

Related Images



Related News


కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు

కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థుల


నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్‌ పాలసీ, అంబేడ్కర్‌ ఐడియాలజీ సదస్సు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బ్రాహ్మణ వ్యతిరేకి


కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివ‌ర్శిటీలో సమీక్ష

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్‌ సెనెట్‌ కమిటీ


కృష్ణా వ‌ర్శిటీలో 2017 పిజి సెట్‌ అడ్మిషన్లకు.. పోస్ట‌ర్ ఆవిష్కరణ

2017 పిజి సెట్‌ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా ల


ఘ‌నంగా ఎస్‌.ఆర్‌.కె. ఇంజినీరింగ్ క‌ళాశాల వార్షికోత్స‌వం

విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన


ఇగ్నోలో తెలుగు మాధ్య‌మంలో కొత్త కోర్సులు

ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగ


ఉత్సాహంగా కృష్ణా యూనివ‌ర్శిటీ స్నాత‌కోత్స‌వం

మ‌చిలీప‌ట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శ‌నివారం ఆహ్లాద