Share this on your social network:
Published:
09-05-2017

పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతికి అంకితం...రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తున్న ప్ర‌తిప‌క్షంః పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు మండలాలకు చెందిన 34 గ్రామాల నిర్వాసిత రైతుల 15,548.44 ఎకరాలకు 1,660 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించినట్లు రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 జూన్ నాటికి పోలవరం నుంచి గ్రావీటి ద్వారా నీటిని అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. ఇందులో భాగంగా 15,582 ఎకరాల భూమిచ్చిన 6,842 మంది రైతులకు రూ.1,479 కోట్ల‌ను రైతుల ఖాతాలో నేరుగా జమచేయడం జరిగిందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తాలను జమ చేసిందన్నారు. ఎకరానికి దాదాపు 10 లక్షల 50 వేల రూపాయలను రైతులకు అందించారన్నారు. మరికొందరికి వడ్డీతో కలిపి రూ.10.92 లక్షల వరకూ జమయ్యాయన్నారు. కుక్కునూరు, ఏలేరుపాడు, జీలుగుమల్లి, బుట్టయ్యగూడెం మండలాలకు చెందిన 34 గ్రామాల్లో ముంపునకు గురయ్యే 14,043 ఎకరాలకు 1,502 కోట్ల రూపాయలు, 1,505 ఎకరాల అసైన్ మెంట్ భూములకు రూ.158 కోట్లు… మొత్తం 15,548 ఎకరాలకు 1,660 కోట్లా 75 లక్షలా 48 వేలా 936 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయ్యాయని మంత్రి వెల్లడించారు. దేశ చరిత్రలోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ఇదే మొదటిసారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, రైతులకు నష్టపరిహారం పంపిణీలో సీఎం చంద్రబాబునాయుడు వెనుకంజ వేయలేదన్నారు. 2018 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేయాలంటే ముందుగా ముంపు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు భావించారన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల కృషిని అభినందిస్తున్నామన్నారు. రైతులకు చెల్లించిన నష్టపరిహారాలకు చెందిన బిల్లులను పోలవరం అథారిటీ, కేంద్ర జల వనరుల శాఖ నాబార్డుకు పంపిస్తున్నామన్నారు. ఈ బిల్లులను పరిశీలించిన తరవాత ఆ మొత్తాన్ని రాష్ర్ట ప్రభుత్వానికి రీయింబర్స్ చేస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 7,500 ఎకకాలకు 800 కోట్ల అవసరమని చెప్పారు. దానికి సంబంధించిన చర్యలను అధికారులు తీసుకుంటున్నారన్నారు. పోలవరం పనులను సోమవారం స్వయంగా పరిశీలించానని, గ్యాలరీలో నడుచుకుంటూ వచ్చానన్నారు. ఇది ఒక మంచి అనుభూతి అని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్ నవంబర్లో పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులు దేశ, రాష్ర్ట ప్రజలకు తెలియాలన్నది సీఎం ఉద్దేశమన్నారు. కాంక్రీట్, ఎర్త్, డయాఫ్రమ్‌వాల్ పనులకు సంబంధించి, ఎల్అండ్ టి బావర్ సంస్థ 663 మీటర్లలో 203 మీటర్ల పనులు వేగవంతం చేసిందన్నారు. జర్మనీకి చెందిన 15 మంది నిష్ణాతులు ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు పని చేస్తున్నారన్నారు. ఈ సీజన్లో 663 మీటర్లు పూర్తి చేసి, వచ్చే సీజన్లో గోదావరి నదిలో పూర్తి చేసేలా ప్రణాళికల రూపొందించారన్నారు. కాపర్ డామ్ కు సంబంధించి వచ్చే వారం పనులు ప్రారంభించడానికి అధికారులు డిజైన్లు ఫైనలేజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. స్పిల్ వే బ్రిడ్జి, కాపర్ డ్యామ్ పనులు వేగవంతానికి అధికారులు కృషి చేస్తున్నారన్నారు. డయాఫ్రమ్ వాల్ అయిన తరవాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు జరుగుతాయన్నారు. ఈలోగా గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. పునరావాసంలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాలనీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించామని, ఇళ్ల నిర్మాణాలపూర్తి చేసి వారికి అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా స్ఫూర్తితో తూర్పుగోదావరి జిల్లాలోనూ నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Related ImagesRelated News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే