Share this on your social network:
Published:
08-05-2017

దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌మంత్రి సోమిరెడ్డి ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. స్థానిక మిర్చి రైతుల‌తో ముఖాముఖి చ‌ర్చించేందుకు మంత్రి ఈ ప‌ర్య‌ట‌న చేశారు.మంత్రి రైతుల‌తో మాట్లాడుతూ ,మిర్చి అమ్మ‌కంలో వాళ్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతుల నివాసానికి వెల్లి వాళ్లు పండించిన మిర్చి పంట‌ను ప‌రిశీలించారు.రైతుల‌కు అందిన సాగుధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. పొలాల‌కు అనుసంధానంగా స‌రుకు ర‌వాణా చేయుట‌కు అవ‌స‌ర‌మైన రోడ్ల నిర్మాణం చేప‌ట్ట‌వ‌ల‌సిందిగా రైతులు ఈ సంద‌ర్భంగా మంత్రిని కోరారు.స్థానిక ఎం.పి.టి.సి సాయిబాబా ఇంటి వ‌ద్ద రైతుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2వ స్థానంలో ఉంద‌ని మంత్రి తెలిపారు. విత్త‌నాల స‌బ్సిడికి 220 కోట్ల రూపాయ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింద‌ని,వ్య‌వ‌సాయానికి అవ‌స‌ర‌మైన ప‌నిముట్లు,ట్రాక్ట‌ర్లు,స్పేర్ పార్ట్స్ రాయితిపై రైతుల‌కు అంద‌జేసి యాంత్రీక‌ర‌ణ ఈ రంగంలో జ‌రుగుతుంద‌ని మంత్రితెలిపారు. రైతుల విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని,నేనూ రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన వాడినేన‌ని మంత్రి అన్నారు. రాయితీలు ఇచ్చే విష‌యంలో ఎవ‌రైన ద‌ర్వినియోగానికి పాల్ప‌డితే స‌హించేది లేద‌ని,రైతుల‌కు క‌ల్తీ విత్త‌నాలు విక్ర‌యిస్తే ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేద‌ని,రైతుల‌కు న‌ష్టం క‌లిగించే విధంగా క‌మీష‌న్ ఏజంట్లు ప్ర‌వ‌ర్తిస్తే చ‌ర్య‌లు తీసుకొంటామ‌ని మంత్రి తెలిపారు. మిర్చి క్వింటాకు 1500 రూపాయ‌ల చొప్పున 20 క్వింటాళ్ళ వ‌ర‌కు రైతుకు ఆన్ లైన్ ద్వారా న‌గ‌దు చెల్లించ‌డుతుంద‌ని,జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని మంత్రి తెలిపారు.

Related ImagesRelated News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే