Share this on your social network:
Published:
12-05-2017

ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పట్టణంలోని శాశ్వత పారిశుద్ధ్య కార్మికురాలి నుంచి లంచం తీసుకోగా అధికారులు ఆయన్ను గురువారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ వివరాల ప్రకారం.. గుడివాడ పట్టణంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న షాలేమురాజు గతేడాది పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చాడు. తన వద్ద పనిచేసే కార్మికుల నుంచి ప్రతినెలా పెద్దమొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్నాడు. ప్రతినెలా జీతంలోరూ. మూడు వేలు ఇవ్వందే తమకు మస్టర్లు వేసేవాడు కాదని, ఈ నేపథ్యంలో వడ్డాది కుమారి అనే పారిశుద్ధ్య కార్మికురాలు తమను ఆశ్రయించిందని డీఎస్పీ వివరించారు. తన వద్ద పనిచేసే ప్రతి కార్మికుడు నుంచి షాలేమురాజు ఇదేవిధంగా ప్రతినెలా లంచాలు దండుకుంటున్నట్లు బాధితురాలు చెప్పిందన్నారు. ఈ క్రమంలో కుమారికి మూడునెలల జీతం ఒకేసారి వచ్చిందన్నారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రూ. 10వేలు డిమాండ్‌ చేయగా, విషయాన్ని ఆమె తమ దృష్టికి తీసుకొచ్చిందన్నారు. తాము ఆమెకు రూ. 10 వేలు(కొత్త 500 నోట్లు) ఇచ్చి పంపామన్నారు. గురువారం సాయంత్రం గుడివాడ షాగులాబ్‌ చంద్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో ఉన్న శానిటరీ డివిజన్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలు కుమారి నుంచి శానిటరీ ఇన్పెక్టర్‌ షాలేమురాజు తీసుకున్నాక దాడి చేసి పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. నోట్లు తీసుకున్న తర్వాత అతని చేతులు శుభ్రం చేయగా వచ్చిన రంగు నీటిని సీసాలో సేకరించి,రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచనున్నట్లు చెప్పారు. డీఎస్పీతో పాటు సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. తమ కష్టార్జితంలో నెలకు రూ.3 వేలు ఇవ్వాల్సి రావడం చాలా బాధగా ఉండేదని, ఏడాది కాలంగా ఇలాగే నెలనెలా జీతం డబ్బులు పిండేస్తుండటంతో ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితురాలు పేర్కొంది.

Related ImagesRelated News


అంద‌మైన అమ్మాయిల‌తో మాట్లాడించి... క‌వ్వించి... దోచేస్తారు

అంద‌మైన అమ్మాయిల‌తో ఫోన్‌లో మాట్లాడిస్తారు... క‌వ్విస్తారు.. ఇంటికి ర‌


బ్లేడ్ బ్యాచ్‌తో భ‌యం..భ‌యం

గంజాయి, మద్యానికి బానిసైన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా తయారవుతున్నారు. వ


నున్న మామిడి మార్కెట్‌లో 10కిలోల ప్ర‌మాద‌క‌ర ఇథలిన్ స్వాధీనం

నున్న మామిడి మార్కెట్‌లో ఆహార తనిఖీ అధికారులు మంగ‌ళ‌వారం దాడులు చేసి 1


బెట్టింగ్ చేశారు..ప‌ట్టుప‌డ్డారు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు నిందితు


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


ఆరు కుటుంబాల్లో చీక‌ట్లు నింపిన మేడికొండూరు ప్ర‌మాదం

మేడికొండూరు వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాల


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


ఇళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు దొంగలను అర్బన్‌ నేరవిభాగ పోలీసులు అరెస్టు చ


మంత్రి నారాయ‌ణ కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్


ఏసీబి కి ప‌ట్టుబ‌డిన గుడివాడ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుక


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

పేకాట వంటి జూదాలకు నిలయమైన కైకలూరు ప్రాంతంలో తాజాగా క్రికెట్‌ బెట్టి