Share this on your social network:
Published:
09-05-2017

బీజేపి,టిడిపి పాల‌న‌లో కార్మికుల దోపిడిఃఏపీ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు ఎన్.ర‌ఘువీరారెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, కార్మికుల హక్కుల కోసం రాజీలేని పొరాటాలు చేస్తూ, దేశంలోనే కార్మికుల హక్కులను పరిరక్షిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఇండియాన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ (ఐఎన్టీయూసి) 70వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రఘువీరారెడ్డి పాల్గొని కేకును క‌త్తిరించారు. ఈ సందర్భంగా శ్రామిక శక్తి అవార్డుల‌ను ఆయ‌న ఐఎన్టీయూసీ నాయకులకు అందజేశారు. అనంత‌రం రఘువీరారెడ్డి మీడియాతో మట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల పక్షాన నిలబడి, కార్మికుల ప్రయోజనాల కోసం ఈఎస్ఐ, ఫిఎఫ్, కనీస వేతనం వంటి చట్టాలు తీసుకురావడానికి ఐఎన్టీయూసీ కృషి చేసిందన్నారు. దేశంలోనే 3.35 కోట్ల మంది కార్మికులు కల్గిన అతిపెద్ద ట్రేడ్ యూనియన్‌గా సేవలు అందిస్తుందన్నారు. ఉపాధి హామీ కార్మికుల నిధులు జన్మభూమి కమిటీల ద్వారా దోచేస్తున్నార‌ని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు కొమ్మకాస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని పెద్దపీట వేస్తున్నార‌ని ఫ‌లితంగా దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు విదేశాలు తిరుగుతూ విదేశీయుల ముందు వంగి..వంగి దండాలు పేడితే పరిశ్రమలు తీసుకురాలేర‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు చంద్రమండలాలు, సూర్యమండలాలు తిరిగినా కూడా పరిశ్రమలు తీసుకురాలేడన్నారు. చంద్ర‌బాబు అన్ని దేశాలు తిరిగి వారికి ఆయా దేశాల సాంప్రదాయల ప్రకారం దండాలు పెట్టడం నేర్చుకున్నాడే తప్పించి దాని వలన రాష్ట్రానికి కంపెనీలు రాలేదని ఎద్దెవా చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపికి పరిశ్రమలు ఎగురుకుంటూ వస్తాయన్నారు. చంద్రబాబు చీఫ్‌ట్రిక్స్ మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హిత‌వు పలికారు. కార్య‌క్ర‌మంలో ఐఎన్టీయూసి జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, ఐఎన్టీయూసీ కృష్ణాజిల్లా అధ్యక్షులు బి.వి.వెంకటసుబ్బయ్య, బిఎస్ఎన్ఎల్ శెట్టి సురేష్‌బాబు, పణుకు శేషు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related ImagesRelated News


ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేది క‌వులేః తుర్ల‌పాటి కుటుంబ‌రావు

ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కవులు సూత్రదారులుగా ఉంటారని గ్రంథా


నిలిచిపోయిన కేశినేని ట్రావెల్స్ బస్సులు

కేశినేని ట్రావెల్స్ బస్సు చక్రాలు ఆగిపోయాయి. ప్రజా రవాణా రంగంలో దశాబ్


మ‌త్స్య‌కారుల‌కు రూ.31.41 ల‌క్ష‌ల విలువైన సామ‌గ్రి అంద‌జేత‌

మ‌త్స్య‌కారులు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు స‌ద్వినియోగం చే


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో చంద్ర‌బాబు భేటీ

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో డేటా


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


బీజేపి,టిడిపి పాల‌న‌లో కార్మికుల దోపిడిఃఏపీ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు ఎన్.ర‌ఘువీరారెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తు


ఏపీ మ‌హిళా కాంగ్రెస్ మోదీకి గాజులు పంపి వినూత్న నిర‌స‌న

అసమర్ధ ప్రధాని నరేంద్రమోదీ కేవ‌లం త‌న ప్రసంగాలతోనూ, ప్రచారాలతోనూ కాల